చంద్రబాబు క్యాబినెట్‌లో ఉండేదెవరు? పవన్, లోకేశ్‌లకు దక్కే మినిస్ట్రీ ఏది? జిల్లాల వారీగా వివరాలు..

నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు మొదలు పెట్టారు.

Chandrababu Cabinet : చంద్రబాబు క్యాబినెట్ లో ఎవరెవరు ఉండనున్నారు? ముఖ్య నేతలు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? టీడీపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్, లోకేశ్ … మంత్రివర్గంలో చేరతారా? లేదా? సీనియర్లలో బెర్త్ దొరికేదెవరికి? చాన్స్ కొట్టేసే జూనియర్ నేతలు ఎవరు?

నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తు మొదలు పెట్టారు. స్వర్ణాంధ్ర రథసారధితో కలిసి పరుగులు తీయగల సమర్ధులకే పెద్ద పీట వేస్తారన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి చంద్రబాబు కేబినెట్ లో ఎవరెవరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది?

ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారంతో పాటు చంద్రబాబుతో పాటు క్యాబినెట్ లో ఎవరెవరు? ఉండబోతున్నారు? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అటు ఎన్డీఏలో కంటిన్యూ అవుతున్న టీడీపీ కచ్చితంగా కేబినెట్ లో కూడా ఉంటామని ఒక స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో కచ్చితంగా అక్కడ కేబినెట్ కూర్పుకి, ఇక్కడ మంత్రివర్గం కూర్పుకి లింక్ ఉండబోతోందా?

130కి పైగా స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో చంద్రబాబుకి మంత్రివర్గ సభ్యుల ఎంపిక ఇప్పుడు కత్తిమీద సాములా మారబోతోందా? మరోవైపు కూటమిలో ఉన్న జనసేన, బీజేపీలకు ఎన్ని మంత్రిపదవులు ఇవ్వబోతున్నారు? ఆయా పార్టీలలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి? ”చంద్రబాబు క్యాబినెట్..” 10టీవీ స్పెషల్ అనాలసిస్..

Also Read : జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు.. చరిత్ర సృష్టించిన రాజకీయ అపర చాణక్యుడు

 

పూర్తి వివరాలు..