జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు.. చరిత్ర సృష్టించిన రాజకీయ అపర చాణక్యుడు

ఏ సంఖ్యా బలం చూసి రెచ్చిపోయారో ఆ సంఖ్యలు తలదన్నేలా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు చంద్రబాబు.

జీరో నుంచి హీరో.. దటీజ్ చంద్రబాబు.. చరిత్ర సృష్టించిన రాజకీయ అపర చాణక్యుడు

Chandrababu Naidu Success Story : అవమానాలు, అవహేళనలు, నిర్బంధాలు, నిష్టూరాలు.. 45ఏళ్ల రాజకీయాన్ని అణిచివేయాలనే నియంతృత్వం. అన్నింటికి మించి అసెంబ్లీలో ఘోర పరాభవం. అంతే.. అప్పటివరకున్న ఓర్పు నశించింది. భ్రష్టుపట్టిన ఆంధ్రా రాజకీయాన్ని మార్చాలనే సంకల్పానికి పురుడు పోసింది.

ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ.. ఇంత అవమానం జరిగిన ఈ సభలో ఒక్క క్షణం కూడా ఉండను. మిమ్మల్ని గద్దె దించాక సీఎంగానే ఈ సభలో అడుగుపెడతా అంటూ చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. ఏ సంఖ్యా బలం చూసి రెచ్చిపోయారో ఆ సంఖ్యలు తలదన్నేలా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం నమోదు చేశారు చంద్రబాబు.

నిస్తేజంగా ఉన్న పసుపు సైన్యంలో పోరాట స్ఫూర్తి నింపిన చంద్రబాబు.. తాను అనుకున్నది సాధించేందుకు పక్కాగా ప్లాన్ చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను కలుపుకుని ఆ తర్వాత బీజేపీ పొత్తుతో విజయానికి మార్గం సుగమం చేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, వైసీపీ విమర్శలకు చలించకుండా తాను అనుకున్నది అనుకున్నట్లే చేసి చూపించారు. టార్గెట్ ను చేరుకున్నారు.

Also Read : ఏపీ ఎన్నికల్లో అసలు సిసలు హీరో పవన్ కల్యాణ్.. అలా అనుకున్నది సాధించిన జనసేనాని

పూర్తి వివరాలు..