×
Ad

ఏపీలో పల్లె పోరు ఆలస్యానికి దారితీస్తున్న పరిస్థితులేంటి?

గత ప్రభుత్వం చేసిన చట్టంతో న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో..ఏప్రిల్ 2వరకు వెయిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందట.

Vote (Image Credit To Original Source)

  • ఏపీలో ఇప్పట్లో పంచాయతీ పోరు లేనట్లేనా?
  • లోకల్ బాడీ ఫైట్‌పై సర్కార్ పెద్దల ఆలోచన మారిందా?
  • జూన్‌, జులైలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయా?

Panchayat Elections: తెలంగాణలో లోకల్‌ ఫైట్ అయిపోయింది. నెక్స్ట్‌ ఏపీలో స్థానిక సమరానికి సమయం ఆసన్నమైందన్న టాక్ వినిపించింది. దీంతో ఏపీలోనూ స్థానిక ఎన్నికల న్యూస్‌ హాట్‌ టాపిక్‌ అయింది. స్టేట్‌ ఈసీ రివ్యూస్‌ లోకల్‌ బాడీ పోల్స్‌పై అప్డేట్స్‌ కమింగ్‌ అప్‌ అన్నట్లుగా మార్చేశాయి.

కానీ ఏపీలో పంచాయతీ పోరుకు ఇంకా టైమ్ పట్టబోతోందట. ఇంకో ఆరు నెలల తర్వాతే సర్పంచ్‌ ఎన్నికలు జరిగే అవకాశం ఉందట. ఏపీలో లోకల్ ఫైట్ ఆలస్యమెందుకు? పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయా?

స్థానిక సమరంపై కూటమి సర్కార్ ఫోకస్
ఏపీలో స్థానిక పోరు ఇంట్రెస్టింగ్‌గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. సరిగ్గా ఇదే టైమ్‌లో లోకల్ బాడీస్‌ గడువు కూడా దగ్గర పడుతోంది. దీంతో స్థానిక సమరంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిందన్న టాక్ వినిపించింది.. న్యూఇయర్‌ స్టార్టింగ్‌లోనే పంచాయతీ ఎలక్షన్స్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తోందని కూడా ప్రచారం జరిగింది.

స్టేట్ ఈసీ రివ్యూలు కూడా ఏపీలో లోకల్ ఫైట్‌పై ఆసక్తిని పెంచేశాయి. కట్‌ చేస్తే ఏపీలో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికల పోరు జరిగే అవకాశం కనిపించడం లేదంటున్నారు. గడువుకంటే ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావించినా, కొన్ని కారణాల వల్ల ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదట.

Also Read: KCR: సార్‌ సభకు వస్తారా? రారా? వస్తే అధికార పక్షం నుంచి అటాక్ తప్పదా?

పంచాయతీల పునర్విభజన, విలీనం పూర్తికాకపోవడం ఎన్నికల నిర్వహణకు అడ్డుగా మారిందంటున్నారు. వచ్చేనెల 2వ తేదీ నుంచి జనగణన ప్రారంభమవుతున్నందున పంచాయతీల విభజన జరగడం లేదని, దాంతో లోకల్‌ ఫైట్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఏపీలో పంచాయతీ పాలకవర్గాలకు 2026 ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువు ఉంది. పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన వరకు ఆ పంచాయతీ పరిధిలో మార్పులు, చేర్పులు చేయడం చట్టపరంగా కుదరదని చెబుతున్నారు. దీంతో జనవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచన మార్చుకుని..పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని నిర్ణయానికి వచ్చిందట.

జూన్ లేదా జులైనే పంచాయతీ ఎన్నికలు
ప్రభుత్వ ఆలోచనల ప్రకారం వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలల్లోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి మూడు నెలలు ముందుగా అంటే జనవరిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచనలు కూడా ఇచ్చింది. స్టేట్‌ ఈసీ కూడా ఎన్నికల సన్నాహాలు స్పీడప్ చేసింది. జనవరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే కొన్ని రాజకీయ అంశాలు..మరికొన్ని టెక్నికల్ అంశాలు..పంచాయతీ పోరును లేట్‌ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది.

గత ప్రభుత్వంలో పంచాయతీ పాలకవర్గాలు ఉన్నంతకాలం మార్పులు చేయరాదని చట్టం చేశారు. ప్రస్తుతం పంచాయతీల పునర్విభజనకు ఈ చట్టమే అడ్డంకిగా మారిందట. గత ఎన్నికల్లో వైసీపీ సర్పంచ్‌లను ఏకపక్షంగా గెలుచుకుంది. ఇప్పుడు కూటమి కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని ప్లాన్ చేస్తోంది.

ఇందుకోసం కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి టీడీపీ, జనసేన నేతల నుంచి ప్రతిపాదనలు వెళ్లాయట. కొన్ని పంచాయతీల్లో విపక్షం బలంగా ఉండటంతో వాటిని రెండుగా విడగొట్టడం లేదా దగ్గరలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయాలనే ప్రతిపాదన ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 150 ప్రపోజల్స్‌ వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వం చేసిన చట్టంతో న్యాయ వివాదాలు తలెత్తే అవకాశం ఉండటంతో..ఏప్రిల్ 2వరకు వెయిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. అప్పటి స్టేట్ ఈసీకి కొత్త కమిషనర్‌ వస్తాడని..కొత్త కమిషనర్ ద్వారానే ఎన్నికలు పెట్టాలనేది కూడా ఓ ఆలోచన అంటున్నారు. ఏదేమైనా ఏపీలో పంచాయతీ పోరు జూన్ లేదా జులైలోనే జరిగే అవకాశం ఉందన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.