చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు?: ముద్రగడ
పవన్ కల్యాణ్ మార్కెటింగ్ పోస్ట్ తీసుకొని టీడీపీ కోసం పని చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణపై పోటీ చేస్తే బాగుండేది.
- Naga Srinivasa Rao Poduri
- Published On : April 11, 2024 / 02:39 PM IST
Mudragada Padmanabham: గౌరవ మర్యాదలు తెలియని వ్యక్తి అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఫైర్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం జరిగిన వైసీపీ కాపు సోదరలు ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబును గెలిపించేందుకు పవన్ పనిచేస్తున్నారని, కాపు యువతను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో జనసేన పార్టీని విలీనం చేయాలని పవన్‌కు సలహాయిచ్చారు.
”పవన్ కల్యాణ్‌కు నేనేందుకు సపోర్ట్ చేయాలి? గౌరవ మర్యాదలు తెలియని వ్యక్తికి ఎలా సపోర్ట్ చేయాలి? పవన్ కల్యాణ్ తన చెంచా గాళ్లతో నన్ను తిట్టిస్తున్నాడు. చంద్రబాబు ఐదేళ్ల పరిపాలనలో పవన్ ఏ మడుగులో దాక్కున్నారు? మీరు సమాధానం చెప్తే అప్పుడు నేను సమాధానం చెప్తాను. తెర వెనుక ఉండి మాట్లాడించడం మగతనం కాదు, దమ్ము ధైర్యం ఉంటే నేరుగా నా గురించి ప్రశ్నించండి. 20 సీట్లతో ముఖ్యమంత్రి ఎలా అవుతావు? కాపు యువతను నాశనం చేస్తున్నావు.. నీ వెనుక తిరుగుతున్న యువత తల్లి దండ్రులు ఆవేదనకు గురవుతున్నారు.
ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కనుక 20 సీట్లు కూడా పవన్ త్యాగం చేసి, పార్టీ విలీనం చేయడం మంచిది. షూటింగులకు వెళ్లిపోతే మంచిది, త్యాగశీలిగా మిగిలిపోతావు. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వరు, బౌన్సర్లతో అడ్డుకుంటారు. చంద్రబాబు ఎస్టేట్‌ని కాపాడేందుకే మీరు వచ్చారు. చంద్రబాబు నిన్న నీ కుటుంబాన్ని అవమానించాడు.. అతని కోసం ఇప్పుడు నువ్వు పని చేస్తున్నావు. మార్కెటింగ్ పోస్ట్ తీసుకొని పవన్ కల్యాణ్ టీడీపీ కోసం పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణపై పోటీ చేస్తే బాగుండేది.. సినిమా హీరోని ఓడించిన ఘనత కొట్టుకు దక్కెద”ని ముద్రగడ అన్నారు.
Also Read: ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో అసమ్మతి సెగ.. రెబల్ అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్న నేతలు
