అసెంబ్లీ సమరం : బాబు సారీ చెబుతారా ? సస్పెండ్ చేస్తారా

  • Publish Date - December 13, 2019 / 07:51 AM IST

ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో సారీ చెబుతారా ? లేక సస్పెండ్ చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. మార్సల్స్‌పై టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికార పక్షం డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు. ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానించారని వైసీపీ సభ్యులు వెల్లడిస్తున్నారు. దీనిని టీడీపీ ఖండిస్తోంది. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బాబు నిండు శాసనసభలో వెల్లడించారు. నో క్వశ్చన్ అనే పదాన్ని బాస్టర్డ్ అనే విధంగా చిత్రీకరించారని బాబు ఆరోపించారు. మూడు గంటల పాటు నేను అనని దాన్ని అన్నట్లు చూపించారని తెలిపారు. సీఎం దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడంపై ప్రివిలేజ్ మోషన్ వేస్తామన్నారు బాబు. 

2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల్లో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. 
అసెంబ్లీ గేటు వద్ద డిసెంబర్ 12వ తేదీ గురువారం నాడు జరిగిన ఘటనలో టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు.
తుది నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలేస్తున్నట్లు వెల్లడించారు. 
బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానాన్నిసభ ఆమోదించింది. 
బాబు పశ్చాతాపం వ్యక్తం చేస్తే బాగుంటుందని స్పీకర్ సూచించారు. 
కానీ దానికి బాబు నో చెప్పారు. తనకు జరిగిన అవమానానికి బాధ్యత ఎవరు వహిస్తారంటూ ప్రశ్నించారు. 
Read More : కనిపించని నాలుగో సింహం ‘దిశ చట్టం’ : మంత్రి పుష్ప శ్రీవాణి