Lagadapati Rajagopal : లగడపాటి రాజగోపాల్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా..?

నందిగామలో లగడపాటి రాజగోపాల్‌తో వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. అంతేకాదు.. కాసేపు ప్రైవేట్‌గా చర్చించుకున్నారు. ఇప్పుడిదే పొలిటికల్‌గా హీట్‌ పెంచింది.

Rajagopal

Lagadapati Rajagopal : మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తారా..? 2019 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి.. ఇప్పుడు మళ్లీ పొలిటికల్ లీడర్లతో ఎందుకు టచ్‌లోకి వస్తున్నారు..?ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. నందిగామలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో లగడపాటి సమావేశం కావడం పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు తెరలేపింది. అంతే కాకుండా.. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెల్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇటు ఖమ్మం జిల్లాకు కూడా లగడపాటి రావడం పలువురితో సమావేశమవడంతో.. మళ్లీ రాజకీయాల్లో వస్తారా అనే ప్రశ్న వినిపిస్తోంది.

లగడపాటి రాజగోపాల్‌.. ఒకప్పుడు బెజవాడ పాలిటిక్స్‌లో కీలక నేత. తన చేష్టలతో.. మాటలతో.. సర్వేలతో.. ఎప్పుడూ జనం నోళ్లలో నానేవారు. 2014లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. పార్లమెంట్‌లో పెప్పర్‌ స్ప్రేతో హల్‌చల్‌ చేసిన ఆయన.. ఆ తర్వాత పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు ఎక్కడున్నారో.. ఏం చేశారో కానీ.. రాజకీయాలకు మాత్రం దూరమయ్యారు. మళ్లీ 2019 ఎన్నికల టైంలో సడెన్‌గా ప్రత్యక్షమైన లగడపాటి.. సర్వేల పేరుతో హల్‌చల్‌ చేశారు. ఏపీలో టీడీపీ గెలుపు ఖాయమని.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఓటమి పక్కా అని ఓ రిపోర్ట్‌ రిలీజ్‌ చేశారు. తీరా ఫలితాలొచ్చాక లగడపాటికి షాక్‌ తగిలింది.

Lagadapati Rajagopal : పొలిటికల్ రీఎంట్రీపై లగడపాటి ఏమన్నారంటే?

ఆయన అంచనాలన్నీ తారుమారయ్యాయి. దీంతో మూడేళ్లుగా గప్‌చుప్‌గా ఉన్న ఆయన.. ఇప్పుడు సడెన్‌గా బయటకు వచ్చారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కలిసి పొలిటికల్‌ హీట్‌ పెంచేశారు. అసలు లగడపాటి చర్యలకు అర్థమేంటి? పాలిటిక్స్‌లో రీఎంట్రీ ఇవ్వాలని డిసైడయ్యారా? అదే నిజమైతే వైసీపీ ఎమ్మెల్యేనే ఎందుకు కలిశారు? ఆ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఇలా ఎన్నో ప్రశ్నలు.. పొలిటికల్‌ సర్కిల్స్‌లో తిరుగుతున్నాయి.

నందిగామలో లగడపాటి రాజగోపాల్‌తో వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. అంతేకాదు.. కాసేపు ప్రైవేట్‌గా చర్చించుకున్నారు. ఇప్పుడిదే పొలిటికల్‌గా హీట్‌ పెంచింది. పొలిటికల్‌ లీడర్ల మనసులో ఏముందో చివరిదాకా బయటపెట్టరంటారు. ఇక్కడ కూడా సేమ్‌ సీన్‌. లగడపాటి ఏదో ఫంక్షన్‌కు వస్తే కలిశానని.. ఆయన బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిస్తే వెళ్లి టిఫిన్‌ తినొచ్చానంటున్నారు వసంత కృష్ణప్రసాద్‌. మా ఇద్దరి మధ్య జనరల్‌ ఇష్యూస్‌ మాత్రమే చర్చకు వచ్చాయి.. పాలిటిక్స్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటున్నారు.

KCR And PK : కేసీఆర్‌‌తో పీకే లంచ్ మీటింగ్… ఏం చర్చించారో

తన కుమారుడికి వైసీపీ సీటు ఇప్పించేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.. దీనిపై ఏమంటారన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ లగడపాటి రాజగోపాల్‌తో ఏ రాజకీయ చర్చ జరగలేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్టప్రసాద్. తమ ఇద్దరిది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని…స్నేహితులుగా మర్యాద పూర్వకంగా కలిశామన్నారు. ఇద్దరి మధ్య కులాల ప్రస్తావన కూడా రాలేదని స్పష్టం చేశారు. కానీ.. అసలు సంగతి మాత్రం వేరే ఉందన్న టాక్‌ వినిపిస్తోంది.

ఇకపోతే పొలిటికల్ రీ ఎంట్రీపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. తాను రాజకీయాలు చేసేందుకు రాలేదన్నారు. గరిడేపల్లిలో వివాహానికి హాజరయ్యానని తెలిపారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఏమీ లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణను వివాహ వేడుకలో కలిశానని చెప్పారు. అయితే ఆయనతో రాజకీయాలు మాట్లాడ లేదన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వారిలో మంత్రి పదవి ఎవరికి ఇచ్చారో అడిగానని చెప్పారు. ఆయనతో ప్రత్యక్ష రాజకీయాలపై మాట్లాడలేదని తెలిపారు.

Gudivada Amarnath: వైసీపీకి ఏ పార్టీతో పొత్తులు అవసరం లేదు, చంద్రబాబు ఆశల కోసం పవన్ పనిచేస్తున్నారు: మంత్రి అమర్నాథ్

2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్‌ మెజారిటీ సాధించినా.. రాష్ట్రానికి గుండెకాయ లాంటి విజయవాడలో మాత్రం ఎంపీ సీటు కోల్పోయింది. అక్కడ టీడీపీ అభ్యర్థి కేశినేని విజయం సాధించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీపీ.. ఓటమి తర్వాత పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బెజవాడ పార్లమెంట్‌ స్థానాన్ని కచ్చితంగా గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉంది వైసీపీ హైకమాండ్‌. ఇప్పుడా స్థానం నుంచి లగడపాటి రాజగోపాల్‌ పోటీ చేయబోతున్నారా? అందుకే వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ను కలిసి రూట్‌ క్లియర్‌ చేసుకుంటున్నారా అనే సందేహాలు వస్తున్నాయి.