KCR And PK : కేసీఆర్‌‌తో పీకే లంచ్ మీటింగ్… ఏం చర్చించారో

దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ పేరు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇండియన్‌ పాలిటిక్స్‌ డయాస్‌ మీద ఆయన పాలిట్రిక్స్‌ ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్లాన్స్‌ ఎవరి ఊహకు అందడం లేదు...

KCR And PK : కేసీఆర్‌‌తో పీకే లంచ్ మీటింగ్… ఏం చర్చించారో

Pragathi

Prashant Kishor Lunch Meeting With KCR : రేపోమాపో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని దేశమంతా ప్రచారం జరుగుతున్న సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ అకస్మాత్తుగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రితో సుధీర్ఘంగా చర్చలు జరిపారు. గత రెండు రోజులుగా చర్చలు జరుతున్న ప్రశాంత్ కిశోర్.. సీఎం కేసీఆర్ తో ఆదివారం లంచ్ చేశారు. వారు జరుపుతున్న భేటీ ముగిసినట్లు సమాచారం. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనే దానిపై ఆయనతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీని గద్దెదించేందుకు అవసరమైన అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలు, బీజేపీ పరిస్థితిపై పీకే తో కేసీఆర్ మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వీరి భేటీ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో.. హాఠాత్తుగా ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు.

Read More : కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రశాంత్ కిశోర్..?

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రితో సుధీర్ఘంగా చర్చలు జరిపారు. శనివారం రాత్రి ప్రగతిభవన్‌లోనే బసచేసిన పీకే.. ఆదివారం కూడా కేసీఆర్‌తో చర్చలు కొనసాగించారు. కాంగ్రెస్‌ అధిష్ఠానంతో ఇటీవల వరుస సమావేశాల నేపథ్యంలో పీకే హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌తో ఒప్పందం మేరకు పీకే రాష్ట్రంలో తమ బృందంతో కలిసి రాజకీయ, పాలన పరిస్థితులపై సర్వే నిర్వహించారు. తొలుత 30 నియోజకవర్గాల్లోని సర్వే ఫలితాలను ఇచ్చారు. ఆ తర్వాత 89 నియోజకవర్గాల సర్వే జరిగింది. పీకే ఆ నివేదికను కేసీఆర్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయన కాంగ్రెస్‌ నేతలతో జరిపిన సమావేశాల గురించి సైతం చర్చ జరిగినట్లు సమాచారం. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తాను టీఆర్‌ఎస్‌తో పనిచేస్తానని పీకే వెల్లడించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు చర్చలు కొనసాగించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లో ఓ నిర్ణయాన్ని ప్రశాంత్ కిశోర్ ప్రకటించే అవకాశం ఉంది.

Read More : Prashant Kishor : కాంగ్రెస్‌‌లోకి ప్రశాంత్ కిశోర్ ?

దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ పేరు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇండియన్‌ పాలిటిక్స్‌ డయాస్‌ మీద ఆయన పాలిట్రిక్స్‌ ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్లాన్స్‌ ఎవరి ఊహకు అందడం లేదు. ఇది జరుగుతుందేమో అనుకునేలోగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు పీకే. అంతా అయిపోయింది.. రేపో ఎల్లుండో తన మెడలోని శాలువా స్థానంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడమే తరువాయి.. హస్తం పార్టీలో పీకేకు స్పెషల్‌ పొజిషన్‌ ఉండబోతోంది.. అనే విషయాన్ని దేశమంతా కోడై కూస్తోంది. దీంతో జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేసిన కేసీఆర్‌.. పీకేతో దోస్తీని కటీఫ్‌ చేసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి. కాంగ్రెస్‌లో చేరే వ్యక్తితో తమ పార్టీ వ్యూహాలను డిస్కస్‌ చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదనే వార్తలు వినిపించాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. కేసీఆర్‌, పీకే సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఏకంగా ప్రగతి భవన్‌లోనే ప్రశాంత్‌ కిశోర్‌ మకాం వేయడం.. పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా.. నేషనల్‌ పాలిటిక్స్‌ దృష్టిని ఇటు వైపు తిప్పింది. మరి ఏమి చర్చించారో.. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.