Nara Bhuvaneswari : చంద్రబాబు లేకుండా తొలిసారి ఒంటరిగా.. నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్

ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. Nara Bhuvaneswari

Nara Bhuvaneswari Emotional (Photo : Twitter)

Nara Bhuvaneswari Emotional : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్ చేశారు. చంద్రబాబు లేకుండా తొలిసారి ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా అంటూ ఎమోషన్ అయ్యారు. ఎప్పుడూ చంద్రబాబు, కుటుంబసభ్యులతో కలిసి వెళ్లేదాన్ని. ఈసారి మాత్రం అన్నీ ఒంటరిగా చేయాల్సి వచ్చిందని భువనేశ్వరి వాపోయారు. చంద్రబాబు లేకుండా ఒంటరిగా వెళ్తున్నా. ఈ ప్రయాణం భారంగా ఉంది. దేవుడి దయతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నా అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారామె.

”నా భర్త చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళాను. ఎప్పుడూ కుటుంబసభ్యులతో ఊరు వచ్చే నేను అయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగానే నారా వారి పల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు భువనేశ్వరి.

Also Read : వైసీపీ తెగులుకు జనసేన-టీడీపీ వాక్సినే సరైందన్న పవన్ కల్యాణ్.. ఎన్డీయేతో దోస్తీపై హాట్ కామెంట్స్

ప్రజల్లోకి నారా భువనేశ్వరి..
నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ‘నిజం గెలవాలి’ పేరిట నిర్వహించే ఈ యాత్ర రేపు (అక్టోబర్ 25) ప్రారంభం కానుంది. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో నారా భువనేశ్వరి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత వేదనతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరి ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. 154 కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చనున్నారు. యాత్ర నేపథ్యంలో ఇవాళ (అక్టోబర్ 24) తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు భువనేశ్వరి. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆ వేంకటేశ్వరుడి ఆశీస్సులు సైతం తీసుకున్నారు. అనంతరం తిరుమల నుంచి నారా వారిపల్లె వెళ్లారు. అక్కడ కులదైవం నాగాలమ్మకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.

Also Read : టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయి

నిజం గెలవాలి బస్సు యాత్రకి సంబంధించి టీడీపీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి ఇక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం జగన్‌ ప్రజావ్యతిరేక పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు టీడీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాల నుంచి తొలగించడం, అనర్హత ఓట్లను చేర్పించడంపై నారా భువనేశ్వరి గళం వినిపించనున్నారని సమాచారం. భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి రావడం ఇదే ప్రథమం. అందులోనూ ఈ కార్యక్రమం సొంత జిల్లా నుంచే ప్రారంభించబోతున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ భావిస్తోంది. భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రకు సంబంధించిన ప్రచార రథాన్ని సైతం టీడీపీ సిద్ధం చేసింది.

ట్రెండింగ్ వార్తలు