Govt hospital : చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన.. బాత్ రూమ్ లో ప్రసవించి బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లిన మహిళ

బాత్ రూమ్ శుభ్రం చేయడానికి వెళ్లిన ఆయా బకెట్ల పక్కన పసిబిడ్డను గమనించారు. పసిబిడ్డ ఏడ్వడంతో ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Chittoor govt hospital

Chittoor Govt hospital : చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అమానుష ఘటన వెలుగుచూసింది. బాత్ రూమ్ లో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చి శిశువును అక్కడే వదలి వెళ్లిపోయారు. కడుపు నొప్పి పేరుతో ఆస్పత్రికి వచ్చిన యువతి బాత్ రూమ్ లో బిడ్డకు జన్మనిచ్చారు. పురిటి బిడ్డను బాత్ రూమ్ లోనే వదిలి వెళ్లారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పసిబిడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఔట్ పేషెంట్ విభాగంలో అఖిల పేరుతో యువతి తప్పుడు వివరాలు నమోదు చేసినట్లుగా గుర్తించారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చారన్న వివరాలు లేవు. అయితే, అఖిలతోపాటు ఆమె వెంట మరో యువకుడు ఉన్నారు.

Bombs Under school : బడి పునాదుల్లో బాంబుల గుట్ట .. గుర్తించటంతో తప్పిన పెను ప్రమాదం

కడుపు నొప్పని చెప్పడంతో డాక్టర్లు పరీక్షించారు. అనుమానం వచ్చి ప్రెగెన్సీ టెస్టు చేయించుకొని రావాలని సూచించారు. దీంతో బాత్ రూమ్ కు వచ్చిన అఖిల నీరు లేదని చెప్పడంతో ఆస్పత్రి ఆయా రెండు బకెట్ల నీరు పెట్టారు. ఆ తర్వాత అక్కడే ఆమెకు డెలివరీ అయింది. బిడ్డను ఆ బకెట్ల పక్కన పెట్టి ఆ యువకుడు, ఆమె వెళ్లిపోయారు.

బాత్ రూమ్ శుభ్రం చేయడానికి వెళ్లిన ఆయా బకెట్ల పక్కన పసిబిడ్డను గమనించారు. పసిబిడ్డ ఏడ్వడంతో ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయా పసిబిడ్డను తీసుకెళ్లి డాక్టర్లకు అప్పచెప్పడంతో శిశువుకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.