Murder
Volunteer murder : బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. ఓ మహిళా వాలంటీర్ దారుణ హత్యకు గురైంది. వేమూరు మండలం చావలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాలపల్లికి చెందిన దొప్పలపూడి శారద అనే వాలంటీర్ ను దారుణ హత్య చేశారు.
అదే గ్రామానికి చెందిన మద్ది పద్మారావు అనే వ్యక్తి వాలంటీర్ శారద గొంతుకోసి నరికి చంపాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది.
Village Volunteers : చిత్తూరు జిల్లాలో 74మంది వాలంటీర్ల రాజీనామా, సంచలన ఆరోపణలు
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.