Gangavaram port
Andhra Pradesh : గంగవరం పోర్టు వద్ద నిర్వాసిత మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వైఖరికి నిరసనగా పోర్టు ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు. సోమవారం పోర్టు గేటు వద్ద కార్మికులు ధర్నాకు దిగారు.
Also Read : 2025లో గూగుల్‌లో నెటిజన్లు అత్యధికంగా వెతికింది వీరికోసమే.. టాప్-10 జాబితా ఇదే..
తమ భూములు తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగవరం పోర్టు ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
భూ నిర్వాసితుల ఉద్యోగులకు వన్‌టైం సెటిల్మెంట్ 27లక్షలతో ఒప్పందం జరిగింది. 60 రోజుల్లో చెల్లిస్తామని మేనేజ్‌మెంట్‌తో ఒప్పందం కుదిరించుకుంది. ఉద్యోగులకు 4 లక్షలు 80 వేల రూపాయలు చెల్లించి.. సుమారు రెండు లక్షల 30 వేల వరకు కార్మికులకు చెల్లించాలి. అవేమీ చెల్లించకుండా ఇన్‌కం టాక్స్ పేరుతో కాలయాపన చేయటం పై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే తమకు రావలసిన రెండు లక్షల 30వేల బ్యాలెన్స్ డబ్బులను విడుదల చేయాలని, కార్మికులపైన, కమిటీపైన ఉన్న పోలీస్ కేసుల్ని తక్షణమే ఎత్తివేయించాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులకు రావలసిన పిఎఫ్ డబ్బులను విడుదల చేయించాలని, కార్మికులకు ఎక్స్‌పీరియన్స్ లెటర్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గంగవరం పోర్టు కాలుష్యంతో సతమతం అవుతుంటే ఇప్పుడు కార్మికులను ఇలా వేధించటం వల్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మికుల ఆందోళనతో యాజమాన్యం స్పందించింది. కార్మిక నాయకులను చర్చలకు పిలిచింది. వివిధ అంశాలపై వారితో అధికారులు చర్చిస్తున్నారు.