Yanamala Ramakrishnudu : ఈ అరాచక ముఖ్యమంత్రి పోతే తప్ప రాష్ట్రం బాగుపడదు- యనమల రామకృష్ణుడు

Yanamala Ramakrishnudu : భవిష్యత్తులో పులివెందులలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం స్పష్టంగా కనబడుతోందన్నారు. వై నాట్ పులివెందుల అన్న యనమల..

Yanamala Ramakrishnudu

Yanamala Ramakrishnudu – Pulivendula : టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. ఈ అరాచక ముఖ్యమంత్రి పోతే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అని యనమల రామకృష్ణుడు అన్నారు. ఇదే భావన పులివెందులలో కూడా కనబడుతోందన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయం అన్నారు యనమల.

కడప జిల్లా పులివెందులలో టీడీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దీనికి శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి, జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

Also Read.. Vundavalli Arun Kumar: దీనిపై జగన్, చంద్రబాబు, పవన్ తమ వైఖరేంటో చెప్పాలి: ఉండవల్లి

భవిష్యత్తులో పులివెందులలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం స్పష్టంగా కనబడుతోందన్నారు. వై నాట్ పులివెందుల అన్న యనమల.. పులివెందులతో గెలవడానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల కృషి చేస్తుందన్నార. పులివెందుల టీడీపీ నాయకులకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సహాయ సహకారాలు అందిస్తామని యనమల హామీ ఇచ్చారు. పులివెందుల టిడిపి కార్యకర్తలు అందరూ బీటెక్ రవి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

”సీఎం జగన్ ఆర్థిక నేరస్తుడు. అధికారంలో లేనప్పుడే లక్ష కోట్లు దోచేశాడు. అధికారంలోకి వచ్చాక రూ.3 లక్షల కోట్లు దాచిన జగన్.. పేదవాడు ఎలా అవుతాడు?” అని యనమల ఫైర్ అయ్యారు.

మరోవైపు నాలుగేళ్ల నరకం అంటూ వైసీపీ పాలనలో జరిగిన హత్యలపై టీడీపీ క్యాంపెయిన్ కొనసాగుతోంది. క్యాంపెయిన్ లో భాగంగా టీడీపీ కార్యకర్తల హత్యలను ప్రస్తావిస్తూ వీడియో ట్వీట్ చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో కేవలం వారం రోజుల వ్యవధిలో జరిగిన నేరాలపై నాలుగేళ్ల నరకం అంటూ కొద్ది రోజుల క్రితం తొలి వీడియో విడుదల చేశారు చంద్రబాబు. హత్యా రాజకీయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేడు మరో వీడియో విడుదల చేశారు.

Also Read..MLA Anil Kumar : నువ్వు 10 వేల మందిని తెచ్చుకో.. నేను కేవలం 100 మందితోనే వస్తా : లోకేష్ కు ఎమ్మెల్యే అనిల్ సవాల్

” సీఎం జగన్ ఎంత సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నించినా, కరుణామయుడిలా మరెంత నటించినా లోపలున్న క్రూరమైన వ్యక్తిత్వం బయటపడుతూనే ఉంటుంది. ఆ వ్యక్తిత్వమే తన అనుచరులకు మార్గదర్శకత్వం అవుతుంది. అదే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తుంది” అని చంద్రబాబు అన్నారు. మంగళగిరికి చెందిన ఉమా మహేశ్వర యాదవ్, పల్నాడులో చంద్రయ్య, జల్లయ్య, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, కర్నూలులో మంజుల సుబ్బారావు హత్యలను ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేశారు. వైసీపీ హింసా రాజకీయాలపై రాష్ట్రమా? రావణ కాష్టమా? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు చంద్రబాబు.