Yarlagadda Venkatarao : గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావుని ప్రకటించిన నారా లోకేశ్

వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుకు పార్టీలో చేరిన వెంటనే గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గా నియమించారు నారా లోకేశ్. వచ్చే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావును గెలిపించాలని..వల్లభనేని వంశీని శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

Gannavaram TDP incharge Yarlagadda Venkatarao

Gannavaram TDP incharge Yarlagadda Venkatarao : యార్లగడ్డ వెంకట్రావు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. గన్నవరం టీడీపీ సభలో నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఇలా పార్టీలో చేరారో లేదో వెంటనే గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గా నియమిస్తున్నట్లు నారా లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతు..వచ్చే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావును గెలిపించాలని..వల్లభనేని వంశీని శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వల్లభనేని వంశీకి టికెట్ ఇచ్చిన పార్టీకే ద్రోహం చేశాడంటూ మండిపడ్డారు. అటువంటి తప్పు మరోసారి చేయమని..టికెట్ ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేసిన పార్టీకే వెన్నుపోటు పొడిచిన వంశీని ఓడించాలని పిలుపునిచ్చారు. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలను కాపాడుకునే బాద్యత తనదేనని భరోసా ఇచ్చారు. వైసీపీ పంచన చేరి టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసి  కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిన వంశీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గన్నవరంలో వంశీని, గుడివాడలో కొడాలి నానిని ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం పని చేసే కార్యకర్తలను కాపాడుకుంటామని..అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Andhra Pradesh : కడప గవర్నమెంట్ స్కూల్లో వింత ఆంక్షలు, విద్యార్ధినిలు బొట్టు, పువ్వులు పెట్టుకోవద్దని ఆదేశం

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి చేరిన సందర్భంగా నిన్న(ఆగస్టు 22,2023) రాత్రి గన్నవరంలో భారీ బహిరంగా సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. గన్నవరం సభలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై విరుచుపడ్డారు.

గన్నవరం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. దీంట్లో భాగంగా నారా లోకేశ్‌ సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు నేతలు టీడీపీలో చేరారు. వీరిలో ప్రస్తుత ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా గన్నవరం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వెంకట్రావును నియమించినట్లు లోకేశ్‌ ప్రకటించారు. వల్లభనేని వంశీ ఓటమి కోసం తామంతా కలసి కట్టుగా పనిచేస్తామని..గన్నవరం టీడీపీ కంచుకోట అని మరోసారి అక్కడ టీడీపీ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఆత్మాభిమానంతోనే టీడీపీలో చేరానని తెలిపారు.

కాగా గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. చంద్రబాబు, లోకేశ్ పై ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు చేయటం చేస్తున్నారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుపైనా వల్లభనేని వంశీ అనుచరులు దాడులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా వంశీ ఈ దాడులు చేయించారన్న ఆరోపణలు వచ్చాయి.

Audimulapu Suresh : ఆ పని వైసీపీ వాళ్లే చేశారని తేల్చితే రాజకీయ సన్యాసం తీసుకుంటా : మంత్రి ఆదిమూలపు

ఇటువంటి పరిణామాల మధ్య బలమైన నేత ఉండాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వంశీలాంటి వ్యక్తులకు ధీటుగా ఉండే బలమైన నేతను నియమించాలని అధిష్టానం భావిస్తోంది.   గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు.. తనకు ప్రత్యామ్నాయం చూపించలేదన్న అసంతృప్తితో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. దీంతో పార్టీలోకి రావటంతోనే గన్నవరంలో గట్టి వ్యక్తి ఉండాలనే ఉద్ధేశ్యంతోను..వంశీకి సరైనవాడు అనే ఆలోచనతోను యార్లగడ్డను నియోజకవర్గం ఇన్ చార్జ్ గా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. దూకుడుగా ఉండే వెంకట్రావు వల్లభనేని వంశీకి సరైన ప్రత్యర్థి అవుతారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక గన్నవరంలో టీడీపీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తంచేస్తున్నారు పార్టీ కార్యకర్తలు.