Yashwant Sinha: ద్రౌపది ముర్ముకు తెదేపా మద్దతుపై యశ్వంత్ సిన్హా ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలకడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని యశ్వంత్ సిన్హా అన్నారు. ఢిల్లీలో రెండుసార్లు జరిగిన విపక్షాల సమావేశానికి ఆ పార్టీని ఎందుకు పిలవలేదో తనకు తెలియదని చెప్పారు.

Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పోటీచేస్తుండగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. వీరు ఎవరికివారు వారి గెలుపుకోసం తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఏపీలోని టీడీపీ, వైసీపీలు ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు పలుకుతున్నాయి. ఇప్పటికే ద్రౌపది ముర్ము ఏపీలోని వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. టీడీపీ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలుకుతుందని అందరూ భావించారు. కానీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపారు.

Chandrababu Naidu : సాయంత్రం 5.30గంటలకు ద్రౌపది ముర్ముతో భేటీకానున్న చంద్రబాబు

టీడీపీ ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వడం పట్ల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం పార్టీ మద్దతు పలకడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని యశ్వంత్ సిన్హా అన్నారు. ఢిల్లీలో రెండుసార్లు జరిగిన విపక్షాల సమావేశానికి ఆ పార్టీని ఎందుకు పిలవలేదో తనకు తెలియదని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుహవాటిలో జరిగిన విలేకరుల సమావేశంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పనిలోపనిగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Chandrababu Key Decision : రాష్ట్రపతి ఎన్నికలు.. టీడీపీ మద్దతు ఎవరికో చెప్పేసిన చంద్రబాబు

రాష్ట్రపతి ఎన్నిక అసాధారణ పరిస్థితుల్లో జరుగుతోందని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రధాన సవాలుగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. విపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను వినియోగించుకుంటోందని యశ్వంత్ సిన్హా ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు