YCP Fifth List: సీఎం జగన్ క్యాంప్‌ కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు

తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి మంత్రులు నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.

CM JAGAN

YCP Fifth List: వైసీపీ ఇన్‌చార్జిల మార్పులు, చేర్పులకు సంబంధించి ఐదో జాబితా విడుదలకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. ఇటీవలే వైసీపీ నాలుగో జాబితాను తొమ్మిది స్థానాల్లో మార్పులు, చేర్పులతో విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇక మూడో జాబితాను 21మందితో విడుదల చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో, మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు, చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఐదవ లిస్ట్‌పై జగన్ కసరత్తు చేస్తున్నారు.

పలు పార్లమెంట్, అసెంబ్లీ పార్టీ ఇన్‌చార్జిల మార్పులపై చర్చలు జరిపారు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి మంత్రులు నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.

ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇప్పటికే వైసీపీ జాబితాల్లో చోటు దక్కించుకోలేకపోయిన పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరారు.

వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాంరాం? ఏం చేస్తున్నారో తెలుసా?