వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాంరాం? ఏం చేస్తున్నారో తెలుసా?

కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. జయరాం ఐదు సీట్లు అడుగుతున్నారు.

వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాంరాం? ఏం చేస్తున్నారో తెలుసా?

Gummanur Jayaram

Updated On : January 22, 2024 / 5:41 PM IST

Gummanur Jayaram: ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోకా? లేదా టీడీపీలోకి వెళ్లాలా? అనే సందిగ్ధంలో గుమ్మనూరు జయరాం ఉన్నారు. కాంగ్రెస్ వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

టికెట్ విషయంలో వైసీపీ అధిష్ఠానం తీసుకున్న వైఖరిపై ఆగ్రహంతో ఉన్నారు గుమ్మనూరు జయరాం. ఎమ్మెల్యేగా కాదని జయరాంకు కర్నూలు ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పిస్తుండడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రి నాగేంద్రతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా బాధ్యతలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరాం ఐదు సీట్లు అడుగుతున్నారు.

ఈ నియోజకవర్గాలపై దృష్టి

వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించారు. కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ.. అనంతపురం జిల్లాలో గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం ఫోకస్ పెట్టారు. రాయలసీమ జిల్లాల్లో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో జయరాంను ఉపయోగించుకుంటే పార్టీకి బలం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు.

Also Read: మీరు అడగడం విడ్డూరం.. బడుగులకు స్థానం ఇవ్వరా?: పొన్నం, కవిత వాదోపవాదనలు