Minister Botsa Satyanarayana: ఎయిర్ పోర్టులో జగన్‌పై జరిగిన దాడి వాస్తవం.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ఎయిర్ పోర్టులో జగన్‌పై జరిగిన దాడి వాస్తవం అని, కానీ, ఎన్ఐఏ రిపోర్ట్‌ను కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Minister Botsa Satyanarayana: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎయిర్ పోర్టులో జనుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం విధితమే. ఈ దాడిలో జగన్ భుజంపై గాయమైంది. ఈ కోడికత్తి దాడికి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణ చేస్తోంది. ఇటీవల ఈ ఘటనలో కుట్రకోణం లేదని ఎన్ఐఏ స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యానారాయణ స్పందించారు. ఎయిర్ పోర్టులో జగన్‌పై జరిగిన దాడి వాస్తవం అని అన్నారు. ఎన్ఐఏ రిపోర్ట్‌ను కొన్ని వార్తా సంస్థలు వక్రీకరిస్తున్నాయని అన్నారు.

CM Jagan : చంద్రబాబును టార్గెట్ చేసిన సీఎం జగన్

కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ కోడి కత్తి దాడి జగన్ చేయించుకున్నారన్న భావన కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై ఎయిర్ పోర్ట్‌లో జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నదే మా డిమాండ్ అని చెప్పారు. అలిపిరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు‌పై నక్షల్స్ దాడి చేశారని, అదికూడా రాజకీయ లబ్దికోసం బాబు చేయించుకున్నాడా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Minister Roja : కుప్పంలోనైనా నగరిలోనైనా చర్చకు సిద్ధం.. దమ్ముంటే రా.. చంద్రబాబుకు మంత్రి రోజా ఛాలెంజ్

కోడికత్తి దాడికి పాల్పడిన శ్రీనివాస్ ఏ ఉద్దేశ్యంతో చేశాడో తెలియాలన్నారు. ఎన్ఐఏ రిపోర్ట్ లో ఏముందో ఎలా తెలిసిందని బొత్స ప్రశ్నించారు. కావాలనే జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశంపైనా బొత్స స్పందించారు. విశాఖ ఉక్కు‌పై మా విధానం ఒక్కటే అని అన్నారు. ప్రైవేటీకరణ‌కు మా ప్రభుత్వం వ్యతిరేకమని బొత్స స్పష్టం చేశారు. బీఆర్ఎస్ దెబ్బకు ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోయిందనేది అవాస్తవం అని అన్నారు. అఖిలపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదని, అందుకే విశాఖ స్టీల్ విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లటం లేదని బొత్స సత్యనారాయణ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు