YCP: హిందూపురం వైసీపీ గ్రూప్‌ రాజకీయాలతో అధినేత సతమతం.. ఏం జరుగుతుందో తెలుసా?

మంత్రి పెద్దిరెడ్డి ఎంతగా సర్దిచెబుతున్నా స్థానిక వైసీపీ నేతల తీరు మారడం లేదు. హిందూపురంలో గ్రూప్ రాజకీయాలతో వైసీపీ అధిష్ఠానం సతమతం అవుతోంది.

YCP Internal Clashes in Hindupur

YSRCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తుండగా, వైసీపీలో ఇప్పటికీ ఒక్కతాటిపైకి రాలేకపోతున్నారు ఆ పార్టీ నేతలు. మంత్రి పెద్దిరెడ్డి ఎంతగా సర్దిచెబుతున్నా స్థానిక వైసీపీ నేతల తీరు మారడం లేదు. హిందూపురంలో గ్రూప్ రాజకీయాలతో వైసీపీ అధిష్ఠానం సతమతం అవుతోంది.

రాష్ట్ర ప్రజలకు హిందుపురం అంటే మొదట గుర్తుకు వచ్చేది టీడీపీ, బాలయ్యే. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటివరకు టీడీపీకి పెట్టని కోటగా హిందుపురం మారింది. 2019 ఎన్నికల్లో రాయలసీమ అంతటా వైసీపీ ప్రభావం చూపినా శ్రీ సత్యసాయి జిల్లా హిందుపురంలో మాత్రం తెలుగుదేశం గెలిచింది.

అటువంటి నియోజక వర్గంలో ఈ సారి సత్తా చాటాలని వైసీపీ భావిస్తుంటే ఆ పార్టీ నేతలేమో చాలా కాలంగా గ్రూపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పెద్దిరెడ్డి కల్పించుకుని చెప్పినప్పటికీ తమ పని తాము చేసుకుపోతున్నారు. దీంతో వారి తీరు వైసీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.

తమ పార్టీలోని గ్రూపులు.. క్యాడర్‌ను సమన్వయం చేసుకోలేకపోవడంతోనే వైసీపీ హిందుపురంలో దెబ్బతింటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి దరికి రాకూడదని పక్కా వ్యూహంతో అడుగులు వేయాలనుకుంటోంది వైసీపీ అధిష్ఠానం.

Read Also: తెలంగాణ భ‌వ‌న్‌కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.. సీఎం సీఎం అంటూ నినాదాలు 

ట్రెండింగ్ వార్తలు