Ambati Rambabu: చంద్రబాబు చేసిన తప్పిదాలను వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు

కేంద్రానికి సీడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు నాయుడు పరిశీలించాలని అంబటి రాంబాబు అన్నారు.

పోలవరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పిదాలను వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.

కేంద్రానికి సీడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు నాయుడు పరిశీలించాలని అంబటి రాంబాబు అన్నారు. పోలవరంపై అంతర్జాతీయ నిపుణులు సీడబ్ల్యూసీకి నివేదిక ఇచ్చారని ఆయన తెలిపారు. వైఎస్సార్ సంకల్పంతోనే రాష్ట్రంలో ప్రాజెక్టు వచ్చాయని అంబటి రాంబాబు అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత వైఎస్సార్‌దేనని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని కూడా ఏపీ సర్కారుపై మండిపడ్డారు. ప్రైవేటీకరణ అనేది కూటమి ప్రభుత్వ ఫిలాసఫీ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ తీరు సరికాదని చెప్పారు.

Chandrababu Naidu: అందుకే గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ఆపేసింది: అసెంబ్లీలో చంద్రబాబు