Vallabhaneni Pankaja Sri: వల్లభనేని వంశీ భార్య హాట్ కామెంట్స్.. టార్చర్ చేస్తున్నారు..

వంశీకి గతంలో టైల్ బోన్ ఫ్రాక్చర్, బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయని తెలిపారు.

Vallabhaneni Vamsi Wife Pankaja Sri

వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు ఇవాళ మరోసారి తనిఖీలు చేశారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనకు సంబంధించి ఆయన ఫోనులో ఆధారాలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ నేపథ్యంలో వల్లభనేని వంశి భార్య పంకజ శ్రీ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్తను ఫిజికల్ గా, మెంటల్ టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. తన భర్త వంశీపై ఫాల్స్ అలిగేషన్ లు వేస్తున్నారని చెప్పారు.

Also Read: విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌లో కొత్త కోర్సు.. పూర్తి వివరాలివే..

వంశీకి గతంలో టైల్ బోన్ ఫ్రాక్చర్, బ్రీతింగ్ సమస్యలు ఉన్నాయని పంకజ శ్రీ తెలిపారు. నేరం రుజువు కాకుండానే ఒకే గదిలో బంధించారని, 60 సీసీ కెమెరాలు పెట్టారని చెప్పారు. ఫాల్స్ కేస్ లో ఇంత పనిష్మెంట్ ఎందుకని నిలదీశారు. ఆయన కింద పడుకుంటున్నారని, బెడ్ కావాలని కోర్టులో రిక్వెస్ట్ చేస్తామని తెలిపారు.

ఒక సెల్ లో బంధించి ఎవరిని కలవానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని పంకజ శ్రీ అన్నారు. తన భర్తకు ప్రాణహాని ఉందని చెప్పారు. వైఎస్ జగన్, పార్టీ తమకు సపోర్టుగా ఉందని తెలిపారు. లీగల్ టీమ్ సపోర్ట్ ఇస్తున్నారని చెప్పారు. వచ్చే వారం వైఎస్ జగన్ ను కలుస్తున్నానని అన్నారు.

కాగా, వంశీని అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఫోన్ కనపడలేదు. ఆయన మొబైల్ కోసం పోలీసులు ప్రయత్నాలు జరుపుతున్నారు. అందుకే హైదరాబాద్‌కు ఏపీ నుంచి రెండు దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మొత్తం 94 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో ఏపీ సీఐడీ 40 మందిని అరెస్ట్ చేసి, మిగిలిన వారి కోసం గాలింపు జరుపుతోంది. శుక్రవారం కూడా ఏపీ సీఐడీ పోలీసులు వంశీకి ఇంటికి వచ్చారు.