విశాఖలో భగ్గుమన్న వర్గ విభేదాలు..యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టిన వైసీపీ నేతలు

  • Publish Date - December 11, 2020 / 03:21 PM IST

YCP leaders beat a young man : విశాఖ జిల్లా భోగాపురంలో వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ మాట వినటం లేదంటూ అప్పలరాజు అనే యువకుడిని కొంతమంది వైసీపీ నేతలు చెట్టుకు కట్టేసి కొట్టారు. చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి అప్పలరాజు అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు.



అయితే కొద్ది కాలంగా గ్రామంలోని ఇతర వైసీపీ నేతలతో అప్పలరాజుకు విభేదాలున్నాయి. దీనితో అప్పలరాజు తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్ ను ఆపేసిన నేతలు… అతనికి చెందిన పశువులను కూడా అమ్మేశారు.