MLA Anil Kumar Yadav
YCP MLA Anil Kumar Yadav : వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో సోనియాగాంధీని చూసి దేశం మొత్తం భయపడుతుంటే ఆమెనే భయపెట్టిన వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్‌మోహన్ రెడ్డిని ఆటాడించే దమ్ము ధైర్యం ఉన్న మగోడు ఏపీలో ఇప్పటి వరకు పుట్టలేదని అన్నారు. నవ్వుతూ కామ్‌గా ఉన్నాడులే.. ఏమీ చేయలేడులే అనుకుంటున్నారేమో.. దేశంలో చాలామందిని గడగడలాడించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అని గుర్తుతెచ్చుకో పవన్ అంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సూచించారు.
CM Jagan : చదువు అనేది ఓ బ్రహ్మాస్త్రం .. అది ప్రతీ ఒక్కరి చేతిలోను ఉండాలి : సీఎం జగన్
పవన్ కళ్యాణ్ కాదు కదా.. ఎంతమంది కట్ట కట్టుకు వచ్చినా జగన్ వెంట్రుకను కూడా టచ్ చేయలేరు అంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు మాట్లాడడం వల్ల శ్వాస, శ్రమ దండగ.. వారాహికి పెట్రోల్ దండగ. ఓ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘నువ్వు ఏడైతే మొదలయ్యావో లాస్ట్‌కి ఆడే తేల్తావ్ బద్దం’ అని చెప్పిన డైలాగ్ ఆయనకే వర్తిస్తుందంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడేవి, చెప్పేవి ఏమీ జరగవు. 2024 జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే మీ అందరిని నడిరోడ్డుపై ఓడించి హైదరాబాద్‌కి పంపించడం ఖాయం అంటూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ దీమా వ్యక్తం చేశారు.