CM Jagan : చదువు అనేది ఓ బ్రహ్మాస్త్రం .. అది ప్రతీ ఒక్కరి చేతిలోను ఉండాలి : సీఎం జగన్
చదువు ఒక్కటే పేదరికం నుంచి బయటపడే మార్గం. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సీఎం జగన్ సూచించారు.

CM Jagan
CM Jagan : చదువు అనేది బ్రహ్మాస్త్రం..అది ప్రతీ ఒక్కరి చేతిలోను ఉండాలి అంటూ సీఎం జగన్ ఆకాంక్షించారు. వైఎస్సార్ కల్యాణ్మస్తు,షాదీ తోఫా నిధులను విడుదల చేసిన సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతు..ఇప్పటి వరకు రెండు విడతల్లో కల్యాణమస్తు, షాదీ తోఫా అందించామని..మూడో విడతతో లకిసి రూ.267 కోట్లు సహాయంగా అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో ఇటువంటి సహాయాలు చేసామా అంటే చేశాంలే అన్నట్లుగా ఉండేదని..డబ్బుల ఎగ్గొట్టారని ఆరోపించారు.
కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అందుకోవాలంటే ప్రతీ ఆడపిల్లా చదువుకోవాలని..అందుకే తమ ప్రభుత్వం 10th చదవాలి, 18ఏళ్లు నిండాలని నిబంధన పెట్టామని తెలిపారు. ప్రతీ ఆడపిల్ల చదువుకోవాలనేది తమ ఆకాంక్ష అని అన్నారు. చదువు అనేది ఓ బ్రహ్మాస్త్రం లాంటిది అది అందరి చేతుల్లోని ఉండాలని ఆకాంక్షించారు. చదువు ఒక్కటే పేదరికం నుంచి బయటపడే మార్గమన్నారు. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సూచించారు. ప్రతీ అమ్మాయి డిగ్రీ వరకు చదువుకోవాలని వారి కాళ్లమీద వారు నిలబడాలని ఆర్థికంగా ఆడపిల్లలు ఎవరిమీదా ఆధారపడకూదని సూచించారు.
కాగా..వైఎస్సార్ కల్యాణ్మస్తు,షాదీ తోఫా నిధుల సందర్భంగా 18,883 జంటలకు రూ.141.60 కోట్ల సహాయం అందిస్తున్నామని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. ఇది ఏప్రిల్-జూన్ త్రైమాసికంగా పెల్లి చేసుకన్నవారికి వర్తించనుంది.