Dharmana Prasada Rao : ప్రభుత్వ పనులు చేసే వారు నష్టపోతున్నారు, వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సలహాలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారాయన.

Dharmana Prasada Rao : ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులపై వైసీపీ సీనియర్ నేత, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సలహాలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారాయన. వారి తీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చర్యల వల్ల శ్రీకాకుళం జిల్లాలో నరేగా నిధులతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయాలు, రోడ్లతో పాటు ఇతర నిర్మాణాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. పనుల అంచనాల ప్రతిపాదనల్లో తప్పిదాలు జరిగాయన్నారు.

Read More..Joker Malware : గూగుల్ వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

మార్కెట్ లో ఉన్న రేట్లకు, ఎస్ఎస్ఆర్ రేట్లకు చాలా తేడా ఉందన్నారు. సిమెంటు, ఇసుక రేట్లు బయట ఎక్కువగా ఉన్నాయని, కానీ ప్రభుత్వం చెల్లించే రేట్లు తక్కువగా పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు నష్టపోతున్నారని అన్నారు. ఉన్నతాధికారులు తప్పులు చేసి ఇంజినీర్లపై ఒత్తిడి పెడితే పనులు జరగవన్నారు. లోపాలను సరిదిద్దాలని మంత్రి పెద్దిరెడ్డికి వివరించానని ధర్మాన చెప్పారు.

Eyes : నిద్రలేవగానే రెండు అరచేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటే ఏమౌతుంది?

”నరేగా పథకాన్ని ఏపీలో సరిగా అమలు చేయలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిమెంట్ సరఫరా సరిగా లేదు. బయట మార్కెట్‍లో సిమెంట్ ధరలు మండిపోతున్నాయి. పరువుకు పోయి పనులు చేపట్టిన వారు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. ప్రభుత్వ పనులు స్తున్న వారు నష్టపోతున్నారు. ఈ లోపాలను సరి చేసుకోవాలి. మెప్పు కోసం అధికారులు ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సలహాలు ఇవ్వొద్దు. అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది” అని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఉన్నతాధికారులను తప్పుపడుతూ వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై అధికారవర్గాల్లో చర్చ నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు