Joker Malware : గూగుల్ వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

స్మార్ట్ ఫోన్ యూజర్లను గూగుల్ హెచ్చరించింది. ఒకవేళ మీ ఫోన్ లో ఈ యాప్స్ వెంటే వెంటనే డిలీట్ చేయాలంది. ఆ యాప్స్ ఏవి అంటే..

Joker Malware : గూగుల్ వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

Joker Malware

Joker Malware : స్మార్ట్ ఫోన్ యూజర్లను గూగుల్ హెచ్చరించింది. ఒకవేళ మీ ఫోన్ లో ఈ యాప్స్ వెంటే వెంటనే డిలీట్ చేయాలంది. మ్యాటర్ ఏంటంటే.. యూజర్ల వివరాలు కాజేయడానికి ఉపయోగపడే ‘ట్రోజన్‌’ జోకర్ మాల్ వేర్ ఉన్న కొన్ని యాప్‌ లను గూగుల్ గుర్తించింది. క్యాస్పర్‌ స్కై సైబర్ సెక్యూరిటీ సంస్థకు చెందిన తత్యానా షిస్కోవా అనే అనలిస్ట్ ఈ యాప్స్‌లో ఉన్న మాల్‌వేర్‌ను కనుగొంది. ఈ విషయం తెలియడంతో వెంటనే స్పందించిన గూగుల్‌.. ప్లేస్టోర్‌ నుంచి ప్రమాదకర జోకర్ మాల్ వేర్ కలిగున్న ఏడు యాప్‌లను తొలగించింది.

WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్

ఈ యాప్స్‌ మన ఫోన్‌లలోని సెక్యూరిటీ వ్యవస్థను టార్గెట్ చేస్తాయి. ఆ తర్వాత మనకు తెలియకుండానే యాప్స్‌లో ఉన్న ఖరీదైన సబ్‌స్క్రిప్షన్స్‌ తీసుకుంటాయి. భారీగా డబ్బు పోయిన తర్వాత కానీ అసలు విషయం వినియోగదారులకు తెలియదు. ఇప్పటికే ఏడు యాప్‌లను బ్యాన్‌ చేసిన గూగుల్ సంస్థ.. ఇకపై వీటిని ఎవరూ డౌన్‌లోడ్‌ చేసుకోలేరని తెలిపింది. అయితే ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న వాళ్లు కూడా వెంటనే అలర్ట్ అవ్వాలని, లేదంటే నష్టపోతారని హెచ్చరించింది.

Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..

గూగుల్‌ బ్యాన్‌ చేసిన ఆ ఏడు యాప్స్‌ ఇవే..

1. క్యూఆర్‌కోడ్‌ స్కాన్ ‌- QRcode Scan
2. ఎమోజీవన్‌ కీబోర్డ్ – EmojiOne keyboard
3. బ్యాటరీ చార్జింగ్ యానిమేషన్స్ బ్యాటరీ వాల్‌పేపర్‌ – Battery Charging Animations Battery Wallpaper
4. డాజిలింగ్‌ కీబోర్డ్ – Dazzling Keyboard
5. వాల్యూమ్ బూస్టర్‌ లౌడర్‌ సౌండ్‌ ఈక్విలైజర్‌ – Volume Booster Loud Sound Equaliser
6. సూపర్‌ హీరో ఎఫెక్ట్ – Super Hero Effect
7. క్లాసిక్ ఎమోజీ కీబోర్డ్ – Classic Emoji Keyboard