ఐదు సంవత్సరాల్లో ఆరు పార్టీలతో పొత్తు..పవన్ లాంటి లీడర్ దేశంలోనే లేడు

  • Publish Date - January 24, 2020 / 07:46 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఒక సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరత్వం ఉన్నాయా ? ఐదు సంవత్సరాల్లో ఆరు పార్టీలతో పొత్తు..పవన్ లాంటి లీడర్ దేశంలోనే లేడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్. పవన్ చేసే మార్చ్‌లు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు ఆయనకు ఆదర్శం, పవన్‌కు ప్రతి విషయంలో ఒకరు తోడు ఉండాలని,  వ్యక్తిగత జీవితంలో గ్యాప్ ఇవ్వడం ఇష్టం లేదు..రాజకీయ జీవితంలో ఒంటరిగా వెళ్లాలనే ఇష్టం లేదని ఎద్దేవా చేశారు గుడివాడ అమర్ నాథ్. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ మీడియాతో మాట్లాడారు. 

ఫిబ్రవరి 02వ తేదీన వైసీపీ, జనసేన పార్టీలు తాడేపల్లి నుంచి విజయవాడ వరకు నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. చట్టాలను అతిక్రమించి, నేరుగా సీటును డిక్టేట్ చేసే పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తి ఉన్నాడని, మేనేజ్ మెంట్ ఎలా చేస్తున్నారో ఆలోచించాలని బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏమైనా విజయం సాధించారా ? అంటే అదీ లేదన్నారు. అమరావతి పరిరక్షణ పేరు పెట్టి..మరో నాలుగు నెలల పాటు రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య ఖూనీని విజయంగా భావిస్తున్నారా ? అని ప్రశ్నించారు అమర్ నాథ్. 

* శాసనసభపలు కీలక బిల్లులు పాస్ అయ్యాయి.
* శాసనమండలిలో రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు పాస్ కాలేదు. 
* ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఛైర్మన్ పంపించారు. 

* దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. 
* శాసనమండలి రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
* సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీతో సీఎం జగన్ చర్చలు జరిపారు. 

* మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. 
* మండలి రద్దు చేసినా..తమకు ఎలాంటి సమస్య లేదని టీడీపీ అంటోంది. 
* 2020, జనవరి 23వ తేదీ గురువారం ఏపీ శాసనసభలో దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. 

* దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్న మండలిని ఏపీలో కొనసాగించాలో వద్దో దానిపై సుదీర్ఘంగా చర్చించాలని సీఎం జగన్ సూచించారు. 
* దాదాపు రూ. 60 కోట్లు ఖర్చవుతోందని, అసలే ఏపీ పేద రాష్ట్రమన్నారు. 
* దీనిపై ఏపీ శాసనసభ 2020, జనవరి 27వ తేదీ సోమవారం సమావేశం కానుంది. 

* అదే రోజునే మండలి రద్దుపై కీలక నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. 

Read More :గెలిచేది ఎవరో : కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు

ట్రెండింగ్ వార్తలు