Kodali Nani: జగన్ కంటే చంద్రబాబు ఆస్తులే ఎక్కువ.. నిమ్మకూరుపై వారికే ప్రేముంది..

చంద్రబాబు నాయుడుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. భార్య ఆస్తి కలిపికూడా చెప్పుకోలేని దారుణమైన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు.

Kodali Nani

Kodali Nani: మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే కొండాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎంగా 14ఏళ్లు ఉన్న చంద్రబాబు నాయుడు గుడివాడకు ఏం చేశారని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ 420 అని, అంబేద్కర్ జయంతి రోజున చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడటం సరికాదన్నారు. గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ అభ్యర్థి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. 1999లో చంద్రబాబు సీఎం‌గా వచ్చి ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తే ఆ అభ్యర్ధి ఓడి‌పోయారని నాని అన్నారు. అయితే, దేవుడి దయవల్ల 2004, 2009లో నన్ను గెలిపించాలని చంద్రబాబు అనలేదు కాబట్టి నేను గెలిచానని కొండాలి నాని అన్నారు. 2019లో అవినాష్‌ను గెలిపించాలని కోరితే గుడివాడ ప్రజలు ఓడించారని, అదీ.. గుడివాడ ప్రజలకు చంద్రబాబుపై ఉన్న ప్రేమ అంటూ విమర్శించారు.

Kodali Nani : బాలయ్యకు కొడాలి నాని పంచులు

చంద్రబాబు నాయుడు ఓ జిత్తులమారి నక్క అంటూ ఘాటుగా విమర్శించారు. చంద్ర‌బాబు గుడివాడ‌కు చేసింది ఏమీ లేదని, 14ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ‌ను గాలికొదిలేశాడని, ఆ సమయంలో గువాడకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని నాని ప్రశ్నించారు. గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుతో నేను చర్చకు సిద్ధమని అన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు మద్దతు పలికిన చంద్రబాబు ఎందుకు ఇక్కడ ఫ్లై ఓవర్లు కట్టలేదో చెప్పాలని అన్నారు. గుడివాడ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అని చంద్రబాబు ఇపుడు దొంగ ప్రేమ ఒలక పోస్తున్నారంటూ కొడాలి నాని విమర్శించారు.

Chandrababu : గుడివాడ సభలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

ప్రస్తుత ప్రభుత్వం హయాంలో గుడివాడ నియోజక వర్గంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పేదలకు ఇళ్లను కడుతూ అభివృద్ధి చేస్తున్నామని, నియోజకవర్గంలో 23వేల మందికి ఇళ్లు ఇస్తున్నామని కొడాలి నాని చెప్పారు. గుడివాడలో పేదలకు ఇళ్ల కోసం ఒక్క ఏకరం చంద్ర‌బాబు కొన్నారా? చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నా రాజకీయాలు వదిలేస్తానని కొడాలినాని అన్నారు. నిమ్మకూరు వెళ్తే చంద్రబాబు ఉండటానికి ఎవరూ ఇల్లు కూడా ఇవ్వలేదని, అందుకే బస్సులో పడుకున్నాడంటూ ఎద్దేవా చేశారు. పెళ్ళైన 42 ఏళ్లకు అత్తగారింటికి వెళ్ళి పడుకున్న చంద్ర‌బాబుకు సిగ్గు ఉందా అంటూ కొండాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Chandrababu : ఒక్క ఛాన్స్‌కు మోసపోయారు ఇప్పుడు బాధపడుతున్నారు, జగన్ రూ.510 కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడు-చంద్రబాబు

ఆ విగ్రహాలు పెట్టించింది నేను, జూనియర్ ఎన్టీఆర్ ..

నిమ్మకూరు‌లో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది నేను, జూనియర్ ఎన్టీఆర్ అని కొడాలినాని అన్నారు. 60 లక్షలు పెట్టి 2003లో ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నిమ్మకూరు‌పై ప్రేమ ఉన్నది పెద్ద ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు మాత్రమేనని, నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్‌కు తప్ప ఎవరికీ ఆస్తులు లేవని కొడాలి నాని అన్నారు.

Chandrababu Naidu : కొడాలి కోటలో చంద్రబాబు

జగన్ కంటే ఎక్కువ ఆస్తులు..

చంద్రబాబు నాయుడుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని కొడాలి నాని అన్నారు. భార్య ఆస్తి కలిపికూడా చెప్పుకోలేని దారుణమైన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. భువనేశ్వరి ఆస్తి 627 కోట్లు, చంద్రబాబు ఆస్తి 20 కోట్లు అని, కానీ చంద్రబాబు భార్య ఆస్తి బయట పెట్టరని అన్నారు. జగన్ దంపతుల ఆస్తి కంటే చంద్ర బాబు ఆస్తి ఎక్కువ అని కొడాలి నాని అన్నారు.