Chandrababu : ఒక్క ఛాన్స్‌కు మోసపోయారు ఇప్పుడు బాధపడుతున్నారు, జగన్ రూ.510 కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడు-చంద్రబాబు

Chandrababu : ఎన్ని ఇబ్బందులు పడుతున్నా జనానికి కోపం రావడం లేదు. భరించడానికి సిద్దపడ్డారు. ఈ నాలుగేళల్లో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు.

Chandrababu : ఒక్క ఛాన్స్‌కు మోసపోయారు ఇప్పుడు బాధపడుతున్నారు, జగన్ రూ.510 కోట్ల ఆస్తి ఎలా సంపాదించాడు-చంద్రబాబు

Chandrababu

Updated On : April 14, 2023 / 12:35 AM IST

Chandrababu : జగన్ ముద్దులకు పరవశించిపోయిన ఏపీ ప్రజలు ఒక్క ఛాన్స్‌కు మోసపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి భస్మాసుర హస్తంలా మారిందని చంద్రబాబు వాపోయారు. ఓట్లేసి వరం ఇస్తే.. ప్రజలనే మోసం చేస్తున్నారు అని జగన్ పై మండిపడ్డారు. జగన్ చేసేది బటన్ నొక్కుడు కాదు బటన్ బొక్కుడు అని చంద్రబాబు విమర్శించారు. గుడివాడలో బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.

సీఎం జగన్ పెద్ద ఎత్తున అవివీతి చేస్తూ నిధులను బొక్కేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అవి నవరత్నాలు కావు నవ మోసాలు అని చంద్రబాబు అభివర్ణించారు. దేశంలోనే ముఖ్యమంత్రుల్లో జగన్ అత్యంత ధనవంతుడు అని చంద్రబాబు చెప్పారు. రూ.510 కోట్ల ఆస్తిని జగన్ ఏ వ్యాపారం చేసి సంపాదించాడని ప్రశ్నించారు.(Chandrababu)

Also Read..Nandamuri Ramakrishna : కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ ఫైర్.. మంచి రోజులు రాబోతున్నాయ్

” ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేపడుతున్నాం. ఇవాళ్టి నుంచి వచ్చే నెలలో రాజమండ్రిలో పెట్టే మహానాడు నాటికి వంద సభలు నిర్వహిస్తాం. ఎన్టీఆర్ పోటీ చేసి.. గెలిచిన తులసి వనం లాంటి గుడివాడలో గంజాయి మొక్క లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. రాష్ట్రంలో నాలుగేళల్లో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు. నేను విమర్శలు చేయాలంటే చాలా చేస్తాను. బూతుల ఎమ్మెల్యేకు తగ్గట్టు మా తమ్ముళ్లు చాలా బూతులు తిట్టగలరు. ఇక్కడి ఎమ్మెల్యేకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే. ప్రతీ ఒక్కరూ జెండా పట్టుకుని రోడ్ల మీదకు వస్తే బూతుల ఎమ్మెల్యే రోడ్ మీదకు రాగలడా..? పారిపోతాడు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందుల్లో కూడా టీడీపీ జెండా ఎగరేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో సీఎం జగన్ కు దెబ్బకు దెయ్యం వదిలింది. జగన్ స్టిక్కర్లు ఇళ్లకు అంటిస్తున్నారు. జగన్ మీద నమ్మకం లేదంటూ కుక్క కూడా స్టిక్కర్ పీకేసింది. కుక్క కూడా జగన్ ని భరించలేకపోయింది.

కోడికత్తి విషయంలో టీడీపీకి సంబంధం లేదని ఎన్ఐఏ చెప్పింది. కోడికత్తి వ్యవహరం డ్రామా అని అర్థమైంది. ఏమీ లేదని ఎన్ఐఏ చెప్పినా మళ్లీ విచారణ చేయాలంటారు. జగన్ కోడి కత్తి డ్రామా కమల్ హాసన్ డ్రామా. పోలవరం ముంచేశాడు. ప్రత్యేక హోదా వదిలేశారు. మెడలు ఒంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు. ప్రజలు మాత్రం ఇదేంటి? అని అడగరు. గత ఎన్నికల్లో ప్రజలు నన్ను అర్థం చేసుకోలేదు.(Chandrababu)

Also Read..Nellore City Constituency: నెల్లూరు పెద్దారెడ్లంతా.. అనిల్‌కు సహకరిస్తారా?

ప్రజలు నన్ను అర్థం చేసుకోకున్నా ఫర్వాలేదు.. కానీ ప్రజల కోసం, పేదల కోసమే పని చేస్తా. ఎన్ని ఇబ్బందులు పడుతున్నా జనానికి కోపం రావడం లేదు. రోడ్లెయ్యకున్నా కోపం రాదు. భరిస్తున్నారు. భరించడానికి ప్రజలూ సిద్దపడ్డారు. కృష్ణా నదికి అనుసంధానం ద్వారా గోదావరి నదిని తెచ్చాం. అనుసంధానం చేశాం. నీళ్లు తాగారు. పంట పండిచుకున్నారు. ఓటేయడం మరిచిపోయారు” అని చంద్రబాబు నాయుడు అన్నారు.