YCP MLA Velampally Srinivas: చందాల వసూళ్లకోసమే టీడీపీ మహానాడు.. ఎన్టీఆర్‌కి అసలైన గుర్తింపు ఇచ్చింది వైసీపీ మాత్రమే

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్టీఆర్ పేరు చంద్రబాబుకు గుర్తుకొస్తుందని వైసీపీ ఎమ్మెల్యే విమర్శించారు.

Andhra Pradesh: టీడీపీ మహానాడు కార్యక్రమం చందాల వసూళ్లు చేయ్యడానికే నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. విజయవాడలో వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సినీనటుడు పోసాని మురళీ కృష్ణ, ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ, లక్ష్మీ పార్వతి, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Vijayashanti about NTR : ఎన్టీఆర్ విజయశాంతికి ఆ విషయంలో సారీ చెప్పారట

టీడీపీ మహానాడు కార్యక్రమం చందాలు వసూళ్లు చేయడానికే నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్టీఆర్ పేరు చంద్రబాబుకు గుర్తుకొస్తుందని, ఎన్నికల సమయంలోనే ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ పార్టీకి గుర్తుకు వస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఎన్టీఆర్ పేరుని చంద్రబాబు వాడుకుంటున్నాడని అన్నారు. ఎన్టీఆర్ కు అసలైన గుర్తింపు ఇచ్చిన పార్టీ వైసీపీ మాత్రమేనని, ఆయన పేరును జిల్లాకు పెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి.. రాజకీయ చరిత్రపై స్పెషల్ ఫోకస్..

రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు 2023ను నిర్వహిస్తుంది. రెండురోజులు జరిగే ఈ కార్యక్రమంలో శనివారం తొలిరోజు ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో చంద్రబాబు, టీడీపీ నేతలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రెండోరోజు ఆదివారం బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 4గంటలకు జరిగే బహిరంగ సభలో చంద్రబాబు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ వేదిక ద్వారా చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు