Vijayashanti about NTR : ఎన్టీఆర్ విజయశాంతికి ఆ విషయంలో సారీ చెప్పారట

ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ప్రముఖులంతా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తమ అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసారు.

Vijayashanti about NTR : ఎన్టీఆర్ విజయశాంతికి ఆ విషయంలో సారీ చెప్పారట

Vijayashanti about NTR

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయనతో తనకున్న తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 100 సంవత్సరాలైనా ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు అందరికీ శిరోధార్యాలే అని..సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే…అంటూ ట్విట్టర్‌లో ఎన్టీఆర్ గురించి కొన్ని అంశాలను పంచుకున్నారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి.. రాజకీయ చరిత్రపై స్పెషల్ ఫోకస్..

14 సంవత్సరాల వయసులో విజయశాంతి ‘సత్యం శివం’ సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ గార్లతో కలిసి నటించారు. ఆ తర్వాత 1985 లో ‘ప్రతిఘటన’ సినిమాకు ఉత్తమనటిగా అవార్డు వచ్చినపుడు అప్పుడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆ సందర్భంలో తనను అభినందించి ప్రజా ప్రాయోజిక చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఎన్టీఆర్ తనను ఆశీర్వదించినట్లు విజయశాంతి తన పోస్టులో షేర్ చేసారు.

 

1990లో ‘బ్రహ్మార్షి విశ్వామిత్ర’ సినిమా డబ్బింగ్ ఏవీఎం స్టూడియోలో జరుగుతోందట. ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెబుతున్నారట. అదే సమయంలో చిరంజీవి గారితో విజయశాంతి డబ్బింగ్ పనిమీద అదే స్టూడియోకి వచ్చారట. ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్లినపుడు థియేటర్‌లో వెలుతురు లేని వాతావరణంలో విజయశాంతిని ఎన్టీఆర్ గమనించకపోవడంతో విజయశాంతి బాధపడ్డారట.

 

ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తర్వాత రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులోని విజయశాంతి గారి ఇంటికి వెళ్లారట. అయితే ఆ సమయంలో విజయశాంతి ఇంట్లో లేకపోవడంతో ఆమె తండ్రి అయిన శ్రీనివాస ప్రసాద్ గారితో ‘అమ్మాయిని మేము చూసుకోలేదు.. పొరపాటు జరిగింది. ఐయామ్ సారీ.. బిడ్డకు తెలియజేయండి’ అని చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా తనకు గుర్తుందని చెప్పుకొచ్చారు విజయశాంతి.

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి కానుక.. సూపర్ హిట్ అడవి రాముడు రీ రిలీజ్ ఆ రోజే..

అక్కడితో ఆగకుండా హైదరాబాద్‌లో ఉన్న విజయశాంతి ఫోన్ నంబర్ తీసుకుని ఫోన్ చేసి మరీ ‘జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా.. ఐ ఎక్ట్రీమ్లీ సారీ’ అని చెప్పేంతవరకూ ఆయన కుదుట పడలేదట. ఎన్టీఆర్ గారు మద్రాస్ వచ్చినప్పుడల్లా మధ్యాహ్నం లంచ్ తమ ఇంటి నుంచి వెళ్లేదని ఆయన ఆప్యాయంగా స్వీకరించేవారని విజయశాంతి తన పోస్టులో చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఎప్పుడైనా షూటింగ్ ఉండే వెళ్తే స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించేవారని ఆతిథ్యానికి వారు మారుపేరని విజయశాంతి గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ గారు బహుశా ప్రపంచం తిరిగి ఎప్పటికీ చూడలేని అరుదైన ఒక కారణజన్ముడు, యుగపురుషుడు అంటూ విజయశాంతి పెద్ద పోస్టు పెట్టారు.