Botsa Satyanarayana : బొత్స బిగ్ ప్లాన్.. రంగంలోకి కుమార్తె.. పార్టీ మార్పుపై ఆగని ప్రచారం..

Botsa Satyanarayana : ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏదో ఒక ప్రచారం హాట్ టాపిక్‌గా ఉంటోంది. లేటెస్ట్‌గా వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ పార్టీ మార్పు ప్రచారం ఊపందుకుంది.

YCP MLC Botsa Satyanarayana

Botsa Satyanarayana : ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏదో ఒక ప్రచారం హాట్ టాపిక్‌గా ఉంటోంది. లేటెస్ట్‌గా వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ పార్టీ మార్పు ప్రచారం ఊపందుకుంది. బొత్స వైసీపీని వీడి..జనసేనలో చేరుతారని పెద్దఎత్తున టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేత కూడా వైసీపీని వీడుతారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్‌తో బొత్స పార్టీ మార్పుపై డిస్కషన్ స్టార్ట్ అయింది. అయితే సాయిరెడ్డి కామెంట్స్‌కు బొత్స గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. క్యాబినెట్ మీటింగులకు వెళ్లకుండా పవన్ ఖాళీగా ఉన్నారని..ఇక్కడ విజయసాయిరెడ్డి ఖాళీగా ఉన్నారని అందుకే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని బొత్స ఫైర్ అయ్యారు. తాను పార్టీ మారట్లేదని చెప్పారు. ఆ తర్వాత ఆయన కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబుని విమర్శిస్తూ హట్ కామెంట్స్ చేశారు.

Also Read : Volkswagen Job Cuts : చైనా ఎఫెక్ట్.. సంక్షోభంలో ఫోక్స్‌వ్యాగన్.. లక్ష మంది ఉద్యోగాలు ఔట్! చరిత్రలోనే అతిపెద్ద లేఆఫ్స్

అయితే, జంపింగ్‌ టాక్‌పై బొత్స రియాక్షన్ చాలా సింపుల్‌గా ఉందన్న చర్చ జరుగుతోంది. ఆయన ఒక్క ముక్కలో తేల్చేశారు. పార్టీ మార్పు ప్రచారాన్ని ఆయన చాలా లైట్ తీసుకున్నారనే చెప్పాలి. తాను ఎందుకు పార్టీ మారుతానని ఆగ్రహం వ్యక్తం చేసి.. అంతటి ఆ టాపిక్‌ను ముగించారు. మరోవైపు వైసీపీ అధినాయకత్వం కూడా బొత్స పార్టీ మార్పు మీద వస్తున్న వార్తలను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని అంటున్నారు. బొత్స వైసీపీలో ఉంటారని.. ఆయనకు తగిన గౌరవం దక్కుతుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట.

బొత్స ఖండించినా.. వైసీపీ అధినాయకత్వం బొత్స పార్టీ మార్పు ప్రచారాన్ని లైట్ తీసుకున్నా.. జంపింగ్‌ టాక్ ఎందుకు ఆగట్లేదన్నది ఆసక్తికరంగా మారింది. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో బలమైన నాయకుడు. గత ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి ఆయన ఓడినా..వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి..మండలి ప్రతిపక్ష నాయకుడి హోదాను కట్టబెట్టింది. వైసీపీ పార్టీలోనూ ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని చెబుతున్నారు. బొత్స కూడా స్థానిక ఎన్నికల ప్రిపరేషన్‌లో బిజీ అయిపోయారని అంటున్నారు. రాబోయే లోకల్ బాడీ పోల్స్‌లో తన క్యాడర్, లీడర్లను గెలిపించుకోవడంతో పాటు.. తన కూతురు అనూషను విజయనగరం జడ్పీ ఛైర్మన్‌గా కంటెస్ట్ చేయించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే తన కూతురు పోటీపై క్లారిటీ ఇచ్చిన బొత్స.. విజయనగరం, విశాఖ సెంట్రిక్‌గా స్థానిక ఎన్నికల కోసం కసరత్తు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సిచ్యువేషన్‌లో బొత్స పార్టీ మార్పు ప్రచారం ఎందుకు జరుగుతుంది.? జంపింగ్ టాక్‌ను వైరల్ చేస్తున్నదెవరు.? నిజంగానే బొత్స పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా.? అసలు ఆయన వైసీపీని వీడుతారన్న టాక్‌ ఎక్కడ మొదలైందన్న చర్చ నడుస్తోంది

బొత్స జనసేనలోకే వెళ్తారన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఆయన ఏ పార్టీలో చేరాలనే డైలమాలో ఉన్నారనే ప్రచారం జరిగినా..వైసీపీలో కంఫర్ట్‌గా లేరనుకోవచ్చు. కానీ బొత్స జనసేనలోనే చేరడం ఖాయమన్నట్లుగా గట్టిగానే ప్రచారం నడుస్తోంది. ఉత్తరాంధ్రలో బొత్స బలమైన నాయకుడు. పైగా బలమైన కాపు లీడర్‌గా గుర్తింపు పొందారు. ఆయన కుటుంబంలో పలువురు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇంకా అప్‌కమింగ్స్ లీడర్స్ తెరమీదకు వస్తున్నారు. రాజకీయంగా ఆయనకు బోలెడంత బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన రాకతో తమకు బలం చేకూరుతుందని.. ఉత్తరాంధ్రలో పట్టు సాధించొచ్చని ఏ పార్టీ అయినా భావించొచ్చు. ఈ నేపథ్యంలోనే బొత్స పార్టీ మార్పు ప్రచారం తెరమీదకు వచ్చి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.

అయితే ఉత్తరాంధ్రలో టీడీపీ స్ట్రాంగ్‌గా ఉంది. డెవలప్‌మెంట్ మోడల్‌తో ఇంకా గ్రాప్ పెంచుకునే ప్లాన్ చేస్తోంది. ఆ పార్టీకి ఉత్తరాంధ్రలో బలమైన లీడర్లు కూడా ఉన్నారు. సో టీడీపీ క్యాడర్ కానీ, లీడర్లు కానీ, అధిష్టానం పెద్దలు కానీ బొత్స తమ పార్టీలో చేరాలని కోరుకునే అవకాశం ఉండదనే చెప్పొచ్చు. ఇక జనసేన ఉత్తరాంధ్రలో బలపడాలని ఆశిస్తోంది. ఓ వైపు పవన్..ఇంకోవైపు నాగబాబు వరుస పర్యటనలతో క్యాడర్‌ను స్రెంథెన్ చేసే పనిలో ఉన్నారు. నాగబాబు వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే జనసేన పార్టీ లీడర్లు, క్యాడర్‌ బొత్స తమ పార్టీలో చేరాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను బొత్స ఖండించినా.. ఆయన వైసీపీని వీడబోతున్నారన్న ప్రచారం మాత్రం ఆగకపోవడం.. రకరకాల ఊహాగానాలకు దారితీస్తోంది. తమ పార్టీ నేతలు, కార్యకర్తల మనోధైర్యం తగ్గించే కుట్రలో భాగంగానే.. కూటమి క్యాడర్ సోషల్‌ మీడియాలో పోస్టులతో అలజడి సృష్టిస్తోందని మండిపడుతోంది వైసీపీ. జంపింగ్‌ బాటలో బొత్స అనే టాక్ ఆగేదెప్పుడో చూడాలి మరి.