Jaya Mangala Venkata Ramana : బెంజ్ కారులో తిరిగిన నన్ను డొక్కు కార్లో తిరిగేలా చేశారు.. చంద్రబాబుపై వెంకట రమణ ఫైర్

టీడీపీ తనకు నమ్మక ద్రోహం చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి జయ మంగళ వెంకట రమణ అన్నారు. డబ్బు ఉన్న వారికే టీడీపీ టికెట్స్ ఇస్తుందని ఆరోపించారు. తన దగ్గర ఉన్న డబ్బు చూసి ఎమ్మేల్యేగా పోటీ చేయాలని టీడీపీ చెప్పినట్లు పేర్కొన్నారు.

Jaya Mangala Venkata Ramana : టీడీపీ తనకు నమ్మక ద్రోహం చేసిందని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి జయ మంగళ వెంకట రమణ అన్నారు. 1999 నుంచి రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. డబ్బు ఉన్న వారికే టీడీపీ టికెట్స్ ఇస్తుందని ఆరోపించారు. తన దగ్గర ఉన్న డబ్బు చూసి ఎమ్మేల్యేగా పోటీ చేయాలని టీడీపీ చెప్పినట్లు పేర్కొన్నారు. తనతోనే మిగిలిన నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టించారని వెల్లడించారు. సొంత సామాజిక వర్గాల కోసం చంద్రబాబు పని చేశారని ఆరోపించారు.

చంద్రబాబు, వెంకయ్య నాయుడు ఇద్దరూ కలిసి తనను మోసం చేశారని పేర్కొన్నారు. 2014లో తాను గెలిచే సీటు అని తెలిసినా తనను పోటీ చేయకుండా చంద్రబాబు ఆపేశారని తెలిపారు. ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి తనను మోసం చేశాడని చెప్పారు. తాను బీసీ కాబట్టి తనను మోసం చేశారని పేర్కొన్నారు. బెంజ్ కార్ లో తిరిగిన తనను డొక్కు కార్లో తిరిగే వాడిలా చేశారని వాపోయారు. తాను చేసిన సేవ తనను మళ్ళీ ఎమ్మెల్సీని చేసిందన్నారు. బీసీలకు అండగా వైసీపీ ఉందని నిరూపితం అయ్యిందన్నారు.

YCP MLC Candidates Nominations : ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

ఎమ్మెల్యే కోటాకు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగల వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసు రత్నం అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. ఏపీ శాసన మండలిలో మార్చి చివరి వారంలో ఖాళీ కానున్న పలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం మార్చి6న రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు