Vallabhaneni Balasouri : బందరు.. నీ అడ్డా కాదు.. నా సత్తా ఏంటో చూపిస్తా-పేర్ని నానిపై వైసీపీ ఎంపీ ఫైర్

నియోజ‌క‌వ‌ర్గంలో పేర్ని నాని ఆగ‌డాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోయింద‌ని ధ్వజమెత్తారు. ఆ టీడీపీ నేతను కలవనిదే నానికి నిద్రకూడా పట్టదన్నారు. నా సత్తా ఏంటో చూపిస్తా అన్నారు.

Balasouri Fires On Perninani

Vallabhaneni Balasouri : కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీలో వర్గపోరు బయటపడింది. అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా పరిస్థితి మారింది. వైసీపీలో కీల‌క నేత‌, మాజీ మంత్రి, మ‌చిలీప‌ట్నం ఎమ్మెల్యే పేర్ని నానిపై అదే పార్టీకి చెందిన మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచలన ఆరోపణలు గుప్పించారు. నియోజ‌క‌వ‌ర్గంలో పేర్ని నాని ఆగ‌డాల‌కు అడ్డూ అదుపు లేకుండా పోయింద‌ని బాల‌శౌరి ధ్వజమెత్తారు. ఎంపీ అయిన తనను సొంత నియోజకవర్గంలోకి రానీయకుండా పేర్ని నాని అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సొంత నియోజ‌కవ‌ర్గంలో ఎంపీకి తిరిగే హ‌క్కు లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

టీడీపీ నేత, మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌తో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నానికి ఏం పని? అంటూ ఎంపీ బాలశౌరి నిలదీశారు. ఇదంతా చూస్తుంటే వైసీపీ ఏ దారి ప‌డుతుందో ప్ర‌జ‌ల‌కే అర్థం కావ‌డం లేద‌న్నారు. ఇక‌పై తాను బంద‌రులోనే ఉంటాన‌ని చెప్పిన బాల‌శౌరి.. ఎవ‌రేం చేస్తారో చూస్తాన‌ని అన్నారు. తాటాకు చ‌ప్పుళ్ల‌కు, ఉడుత ఊపుల‌కు తాను భ‌య‌ప‌డ‌బోన‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ బాలశౌరి.

Chandrababu Tour : వస్తున్నా మీకోసం.. వైసీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు పక్కా ప్లాన్

ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి పేర్ని నాని వర్గీయులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మచిలీపట్నంలో పర్యటించిన ఎంపీ బాలశౌరిని.. పేర్ని నాని వర్గీయులు అడ్డుకోవడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలో పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేశారు.

Pawan Kalyan : జనంలోకి జనసేనాని..ఏపీలో అక్టోబర్ 5 నుంచి పవన్ పర్యటన

‘‘ పేర్ని నానీ.. బందరు నీ అడ్డా కాదు. ఎమ్మెల్యే నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నన్ను మచిలీపట్నం రానీయకుండా చేస్తున్నారు. ఇకపై బందరులోనే ఉంటా .. కార్యక్రమాల్లో పాల్గొంటా. ఎవరేం చేస్తారో చూస్తా. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా. ఇతర పార్టీ ఎంపీ సుజనాతో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీఎంను, పార్టీని, ప్రభుత్వాన్ని సుజనా తిడితే స్పందించరు. సీఎంను అవినీతిపరుడని తిట్టిన వ్యక్తితో కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్లతో వారానికోసారైనా మాట్లాడకపోతే నీకు నిద్రపట్టదు. ఇతర పార్టీ ఎంపీని వారానికోసారి కలవడం దేనికి సంకేతం?’’ అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే పేర్ని నానిపై శివాలెత్తిపోయారు ఎంపీ బాలశౌరి.