Chandrababu Tour : వస్తున్నా మీకోసం.. వైసీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు పక్కా ప్లాన్

వైసీపీని ఎదుర్కోవాలంటే ఎక్కువ కాలం ప్రజల్లో ఉండాలని పార్టీ నేతలు ఇచ్చిన సలహాలతో చంద్రబాబు జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. 26 జిల్లాల్లో ఏడాది పాటు విసృత్త పర్యటన..

Chandrababu Tour : వస్తున్నా మీకోసం.. వైసీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు పక్కా ప్లాన్

Chandrababu Tour (1)

Chandrababu Tour : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ, అప్పుడు ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికల హీట్ స్టార్ట్ అయిపోయింది. మాటల యుద్ధం, పొత్తుల ఎత్తులు జోరుగా నడుస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో మహానాడు నిర్వహణతో పాటు జిల్లాల పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై రోడ్ షోలు, బహిరంగ సభలకు సన్నాహాలు చేస్తున్నారు. 26 జిల్లాల్లో ఏడాది పాటు విసృత్తంగా పర్యటించేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు చంద్రబాబు. క్యాడర్ లో జోష్ పుట్టించేందుకు, అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వైసీపీని ఎదుర్కోవాలంటే ఎక్కువ కాలం ప్రజల్లో ఉండాలని పార్టీ నేతలు ఇచ్చిన సలహాలతో చంద్రబాబు జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఒక్కో టూర్ మూడు రోజుల చొప్పున నెలకు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఈ నెల మూడో వారం నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొదటి రోజు బహిరంగ సభ, రెండో రోజు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులతో సమీక్షలు, క్యాడర్ తో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తారు.

CM Jagan Fix Target : 175 గెలవాల్సిందే.. వైసీపీ నేతలకు జగన్ బిగ్ టార్గెట్

జిల్లా టూర్ లో మూడో రోజు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొంటూ జిల్లా పర్యటనల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై మాట్లాడబోతున్నారు. ఏడాదిలో 80కిపైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పర్యటన రూపొందించారు. అటు జిల్లాల పర్యటనలు, ఇటు పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వ్యవహారాలు సమాంతరంగా జరిగేలా షెడ్యూల్ తయారు చేశారు.

Andhra pradesh : వైసీపీ ప్రభుత్వానికి గడప గడపకూ ఛీత్కారాలే : మాజీ మంత్రి

రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 15న అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగే మినీ మహానాడులో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత 16న అనకాపల్లిలో నియోజకవర్గాల వారిగా సమీక్షల అనంతరం 17వ తేదీన చీపురుపల్లిలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు.