ఐదేళ్ల కాలంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే : విజయసాయి రెడ్డి

ఉత్తరాంధ్రలో నియోజక వర్గాల సంఖ్య 44కి పెరగనుందని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.

Vijaya Sai Reddy

Vijayasai Reddy: ఉత్తరాంధ్రలో నియోజక వర్గాల సంఖ్య 44కి పెరగనుందని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయ‌న మాట్లాడుతూ.. మహిళా కోటా, రిజర్వేషన్లు మొత్తం మారిపోతాయి. ఆ పరిణామాలన్నీ చర్చించుకుని సంసిద్ధం అవుతున్నామ‌ని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేసిన మాట యదార్థంమేన‌ని, గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుని క్షేత్ర స్థాయి నుంచి పార్టీ బలోపేతంకోసం చర్యలు మొదలు పెట్టామ‌ని చెప్పారు.

Also Read: కూతురు కన్నీళ్లు పెట్టుకోవటం చూసి పవన్ కళ్యాణ్ బాధపడ్డారు : సీఎం చంద్రబాబు

విశాఖ ఉక్కుపై మా విధానంలో మార్పు లేదని.. ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకున్నది మేమేన‌ని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. ఉక్కు పరిరక్షణపై చంద్రబాబు చేతులెత్తేశారని, అమరావతికోసం ఉత్తరాంధ్రకు అన్యాయంచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని విజ‌య సాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రం సమగ్ర అభివృద్ది జరగాల్సిన చోట ఒకే ప్రాంతంపై ఫోకస్ చెయ్యడం అంటే మిగిలిన ప్రాంతాలకు నష్టం చేయడమేనని అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం విశాఖ నుంచి అమరావతికి తరలించుకుపోవడమే ఇందుకు ఉదాహరణ అని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.