Vijayasai Reddy : ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారు.. పురంధేశ్వరిపై ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ఫైర్

ఏపీలో మద్యం అమ్మకాలపై కొన్నిరోజులుగా పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలో ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఉగ్రవాదం కన్నా మద్యం ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు.

Vijayasai Reddy

YCP MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏ-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్ పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి దర్యాప్తు సంస్థ సీఐడీకి అందజేయాలని సూచించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి తప్పుడు సమాచారంతో మాపైన నిందలు వేయడం కాదు.. వాస్తవాలు బయట పడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలని పురంధేశ్వరిని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read : Voter List : హైదరాబాద్ ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల.. మొత్తం 45,36, 852 మంది ఓటర్లు

ఏపీలో మద్యం అమ్మకాలపై కొన్నిరోజులుగా పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలో ఆమె మాట్లాడుతూ.. ఏపీలో ఉగ్రవాదం కన్నా మద్యం ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. సాధారణ ప్రజలపై ప్రభుత్వం మద్యం రూపంలో అణుబాంబు వేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మద్యం సేవించి రాష్ట్రంలో ఎంతో మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ సంవత్సరం ఏపీలో మద్యం సేవించి ఐదు లక్షల మంది చనిపోతున్నారనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయని, అనధికారికంగా మరో లక్ష ఉంటుందని పురంధేశ్వరి అన్నారు. పురందేశ్వరి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టేందుకు పురంధేశ్వరి ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : PM Modi : ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు : ప్రధాని మోదీ 

మరోవైపు సీఐడీ అధికారులు మాజీ సీఎం చంద్రబాబుపై మద్యం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రీవెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద మాజీ సీఎం చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వం మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చిందని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీఐడీ. అయితే, ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు