Voter List : హైదరాబాద్ ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల.. మొత్తం 45,36, 852 మంది ఓటర్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వీస్ ఓటర్లు 404 ఉండగా, దివ్యాంగులు 20వేల 207 ఉన్నారని పేర్కొన్నారు.

Voter List : హైదరాబాద్ ఫైనల్ ఓటర్ లిస్ట్ విడుదల.. మొత్తం 45,36, 852 మంది ఓటర్లు

voter list

Updated On : November 11, 2023 / 11:18 PM IST

Hyderabad Final Voter List : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఫైనల్ ఓటర్ లిస్ట్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ విడుదల చేశారు. గ్రేటర్ సిటీలోని 15 సెగ్మెంట్లలో మొత్తం 45లక్షల 36వేల 852 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో పురుష ఓటర్లు 23 లక్షల 22 వేల 623 ఉండగా, మహిళ ఓటర్లు 22 లక్షల 13వేల 902 ఉన్నారు.

ట్రాన్స్ జెండర్స్ 327 ఉండగా, ఎన్ఆర్ఐ ఓటర్లు 883 ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వీస్ ఓటర్లు 404 ఉండగా, దివ్యాంగులు 20వేల 207 ఉన్నారని పేర్కొన్నారు. 18-19 వయసు గల ఓటర్లు 77వేల 522 ఉండగా, 80ఏళ్లకు పైబడినవారు 80 వేల 37 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.