YCP MP Vijayasai Reddy: చంద్రబాబు రాజకీయ జీవితం 2023 వరకేనా? ఎలా అంటే.. విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu naidu

Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి సమయంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. అర్థరాత్రి ఒంటి గంట తర్వాత చంద్రబాబుని జైల్లోకి తీసుకెళ్లారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రోడ్డు మార్గాన పోలీసులు చంద్రబాబును తరలించారు. రాజమండ్రికి చేరుకోవడానికి దాదాపు ఐదు గంటలకు‌పైగానే సమయం పట్టింది. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకోసం జైల్లోని స్నేహ బ్లాక్‌లో ప్రత్యేక గదిని అధికారులు చంద్రబాబుకు కేటాయించారు. ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు వద్ద దాదాపు 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

AP CM Jagan: రాజమండ్రి జైలుకు చంద్రబాబు.. లండన్ నుంచి తిరిగి రానున్న సీఎం జగన్ .. ఏపీకి ఏ సమయానికి చేరుకుంటారంటే..

చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. మంత్రి రోజా చిత్తూరి జిల్లా నగరిలోని తన నివాసం వద్ద బాణాసంచా పేల్చి, వైసీపీ కార్యకర్తలకు స్వీట్లు అందించి సంబురాలు చేసుకున్నారు. చంద్రబాబు తప్పులన్నింటికి రిటన్ గిఫ్ట్ వస్తుందని రోజా విమర్శించారు. ఎంత పెద్దలాయర్లను పెట్టుకున్నా ఇక్కడ చెల్లదు అంటూ మరికొందరు వైసీపీ నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ బంద్‌కు ఆ పార్టీ అధిష్టానం పిలుపునివ్వడంతో సోమవారం తెల్లవారు జాము నుంచే టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకొచ్చారు. అయితే, వారిని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

TDP AP bandh : చంద్రబాబును జైలుకు తరలింపుపై భగ్గుమన్న టీడీపీ.. నేడు ఏపీ బంద్ కు పిలుపు.. సీపీఐ, జనసేన మద్దతు

చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు 2023 రాజకీయంగా చివరి సంవత్సరం అంటూ పేర్కొన్నారు. దీనికి కారణాన్ని కూడా ట్విటర్‌లో విజయసాయి రెడ్డి తెలిపారు. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. ఈ నెంబర్ ఆధారంగా చంద్రబాబు రాజకీయ జీవితానికి ఇదే ఆకరి సంవత్సరం అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఆయన ట్వీట్ ప్రకారం.. ‘ చంద్రబాబు ఖైదీ నెంబర్ 7691… 7+6+9+1 = 23 వస్తుందని, చంద్రబాబు.. మీకు 2023 చివరి సంవత్సరం. 2024 సంవత్సరం నుంచి రాజకీయ యవనికపై ఇక మీరు కనిపించరు. మీ మామగారు ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు అర్ధం అయ్యుంటుంది మీకు. అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.