Pawan Kalyan
Pawan Kalyan Comments : వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజంలో అందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నారు. జులై 5వ తేదీన రాజమండ్రికి వస్తానని.. అప్పుడు తూర్పు గోదావరి జిల్లాల్లో నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.
శుక్రవారం కాకినాడ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత తోట సుధీర్ జనసేన పార్టీలో చేరారు. పెదఅమిరంలో పవన్ కళ్యాణ్ బస చేసిన నిర్మల ఫంక్షన్ హాల్ లో తోట సుధీర్ కు పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
YS Sharmila: చిన్నదొర కేటీఆర్ గారూ.. మీకు ఓ సవాల్ విసురుతున్నా: వైఎస్ షర్మిల
తాను అమ్ముడు పోతే తనకు ఒక మంత్రి పదవి ఇస్తారు, అది చాలా తేలిక అని అన్నారు. కానీ, రాజకీయాలు నడపడం చాలా కష్టమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలి అని పిలుపునిచ్చారు.