YCP Siddham Meeting in Dendulur : దెందులూరులో వైసీపీ ‘సిద్ధం’ బహిరంగ సభ .. ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనాల దారిమళ్లింపు

దెందులూరులో జరిగే సిద్ధం సభకోసం ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మందిని సభకు తరలించేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.

YCP Siddham Meeting

YCP Siddham Meeting : ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇవాళ ‘సిద్ధం’ బహిరంగ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కానుంది. సీఎం జగన్ తో పాటు పలువురు ముఖ్యనేతలు సభలో పాల్గొంటారు. భీమిలి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్ వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సభకు సుమారు 5లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 10 ఎకరాల ప్రాంగణంలో ‘సిద్ధం’ సభకు ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టారు.

Also Read : ఏపీ ఎన్నికల ప్రకటన ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి: అధికారులకు ఈసీ సూచన

దెందులూరులో ఇవాళ జరిగే సిద్ధం సభకోసం ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాది మందిని సభకు తరలించేందుకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని ప్రైవేట్ బస్సులనుసైతం అందుబాటులో ఉంచారు. చెన్నై – కోల్ కతా జాతీయ రహదారికి ఆనుకొని సిద్ధం సభ ప్రాంగణం ఉండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Also Read : విశాఖపట్నం జిల్లాలో ఏ పార్టీ బలం ఎంత? ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది?

  • ట్రాఫిక్ ఆంక్షలు..  వాహనదారులు ఈ రూట్లలో వెళ్లాలి.. 
    వైజాగ్ వైపు నుంచి విజయవాడ, చెన్నై వైపు వెళ్తున్న వాహనదారులను కత్తిపూడి జంక్షన్ వద్ద మళ్లిస్తున్నారు. గొల్లప్రోలు – కాకినాడ – అమలాపురం – చించినాడ – బ్రిడ్జి – నర్సాపురం – మొగల్తూరు – మచిలీపట్నం మీదుగా మళ్లిస్తున్నారు.
  • పెరవలి/సిద్దాంతం వద్ద నుండి
    పెనుగొండ – పాలకోల్లు నరసాపురం మొగల్తూరు మీదుగా మచిలీపట్నంవైపు మళ్ళిస్తున్నారు.
  • తాడేపల్లిగూడెం, తణుకు వైపునుండి వచ్చే వాహనాలు భీమవరం నర్సాపురం – మొగల్తూరు- లోసరి వంతెన మీదుగా మచిలీపట్నం వైపు మళ్ళింపు చర్యలు చేపట్టారు.
  • వైజాగ్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులు దేవరపల్లి – గోపాలపురం – కొయ్యలగూడెం- జంగారెడ్డిగూడెం- జీలుగుమిల్లి- అశ్వారావు పేట- సత్తుపల్లి ఐరా – ఖమ్మం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
  • నెల్లూరు నుండి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను ఒంగోలు వద్ద  తోవగుంట – బాపట్ల – చీరాల – రేపల్లె – అవనిగడ్డ – మచిలీపట్నం – చించినాడ- రాజోలు-అమలాపురం – కాకినాడ మీదుగా మళ్లించారు.
  • హనుమాన్ జంక్షన్ వైపు వెళ్లే  వాహనాలను నూజివీడు – రామన్నపేట్ అడ్డా రోడ్డు- ధర్మాజీగూడెం వైపు మళ్లించారు.
  • హైదరాబాద్ నుండి వైజాగ్ వైపు వెళ్లే వాహనాలను సూర్య పేట వద్ద, చిల్లకల్లు వద్ద మళ్లించి.. ఐరా – అశ్వారావుపేట – దేవరపల్లి మీదుగా ఇబ్రహీంపట్నం వద్ద మైలవరం – తిరువూరు – వి.ఎన్. బంజారా – సత్తుపల్లి మీదుగా మళ్ళింపు
    చేశారు. వాహనదారులు ముందుగానే రూట్లను గుర్తించి సహకరించాలని పోలీసులు కోరారు.