విశాఖపట్నం జిల్లాలో ఏ పార్టీ బలం ఎంత? ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది?

రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా నిలుస్తున్న విశాఖ కేంద్రంగా ఉండే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఊపు ఉంది? మూడు జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి?

విశాఖపట్నం జిల్లాలో ఏ పార్టీ బలం ఎంత? ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది?

Visakhapatnam District Politics

Updated On : February 2, 2024 / 10:19 PM IST

Visakhapatnam District Politics : ఉత్తరాంధ్ర.. రాష్ట్రంలో ఓ చివరన ఉన్న మూడు జిల్లాలు కలిసిన ప్రాంతం. సువిశాల సముద్ర తీరం. పూర్తిగా వ్యవసాయ ఆధారం. ఎంతో రాజకీయ చైతన్యం. పెద్ద పెద్ద నాయకులకు నిలయం. తరతమ బేధం లేకుండా ఎక్కడి వారినైనా ఆదరించే మనస్తత్వం అక్కడి ప్రజల సొంతం. 34 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్రలో గాలి ఎటు వీస్తే అధికారం ఆ పార్టీ వశమైనట్లే. ఇప్పుడు కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఉత్తర కోస్తాలో గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గిరగిరా తిరిగింది.

అంతకుముందు అంటే 2014లో టీడీపీ, ఇంకా ముందుకెళితే వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్ర వెన్నుదన్నుగా నిలిచింది. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా నిలుస్తున్న విశాఖ కేంద్రంగా ఉండే ఉత్తరాంధ్రలో ఈసారి ఏ పార్టీకి ఊపు ఉంది? మూడు జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఉక్కు నగరంపై పట్టు సాధించే పార్టీ ఏది?

15 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఏ పార్టీ బలం ఎంత? పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరెవరు? ఎవరి మధ్య తీవ్రమైన పోటీ ఉండొచ్చు? అభ్యర్థుల బలాబలాలు ఏంటి? ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 10టీవీ ఎక్స్ క్లూజివ్ విశ్లేషణ..

ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 1999
మొత్తం సీట్లు – 37
తెలుగుదేశం పార్టీ – 27 (శ్రీకాకుళం-10, విజయనగరం-6, విశాఖపట్నం-11)
కాంగ్రెస్‌ – 10 (శ్రీకాకుళం-2, విజయనగరం-6, విశాఖపట్నం-2)

ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2004
మొత్తం సీట్లు – 37
కాంగ్రెస్‌ – 21 (శ్రీకాకుళం-7, విజయనగరం-6, విశాఖ-8)
తెలుగుదేశం – 12 ( శ్రీకాకుళం – 4, విజయనగరం-5, విశాఖపట్నం-3)
ఇతరులు -4 (కురుపాం-CPM, విజయనగరం-స్వతంత్ర, చింతపల్లి-సీపీఐ, పాడేరు-బీఎస్‌పీ లకే రాజారావు)

ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2009
మొత్తం సీట్లు – 34
కాంగ్రెస్‌ – 23 (శ్రీకాకుళం-9, విజయనగరం-7, విశాఖపట్నం-7)
తెలుగుదేశం – 7 (శ్రీకాకుళం-1, విజయనగరం-2, విశాఖపట్నం-4)
ప్రజారాజ్యం – విశాఖపట్నం జిల్లాలో 4 సీట్లు గెలుచుకుంది

ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2014
మొత్తం సీట్లు – 34
తెలుగుదేశం 24 ( శ్రీకాకుళం – 7, విజయనగరం – 6, విశాఖపట్నం – 11)
వైసీపీ 9 (శ్రీకాకుళం-3, విజయనగరం – 3, విశాఖపట్నం – 3)
2014 ఎన్నికల్లో బీజేపీ విశాఖ నార్త్‌ నుంచి గెలుపొందింది

ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు 2019
మొత్తం సీట్లు – 34
వైసీపీ 28 ( శ్రీకాకుళం – 9, విజయనగరం – 9, విశాఖపట్నం -10 )
వైసీపీ 5 (శ్రీకాకుళం-1, విజయనగరం – 0, విశాఖపట్నం – 4)

—————–

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా
భీమిలి – అవంతి శ్రీనివాసరావు
కోరాడ రాజబాబు, గంటా శ్రీనివాసరావు, సందీప్‌ పంచకర్ల
విశాఖ తూర్పు – ఎంవీవీ సత్యనారాయణ, ఎంపీ, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే
విశాఖ దక్షిణ – వాసుపల్లి గణేశ్‌కుమార్‌, గండి బాబ్జి, వంశీకృష్ణ యాదవ్‌
విశాఖ ఉత్తర – కేకే రాజు, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు
విశాఖ పశ్చిమ – ఆడారి ఆనంద్‌కుమార్‌, గణబాబు, ఎమ్మెల్యే
గాజువాక – వరికూటి రామచంద్రరావు, పల్లా శ్రీనివాసరావు
పెందుర్తి – ఆదీప్‌రాజు, గుడివాడ అమర్‌నాథ్‌
బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు ( జనసేన )
అనకాపల్లి – మలసాల భరత్‌, పీలా గోవిందరావు
చోడవరం – కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్‌
బత్తుల తాతయ్యబాబు, కేఎస్‌ఎన్‌ రాజు
మాడుగుల – బూడి ముత్యాలనాయుడు
పీవీజీఆర్‌ కుమార్‌, గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్‌
ఎలమంచిలి – కన్నబాబురాజు, సుకుమార వర్మ
ప్రగడ నాగేశ్వరరావు, సుందరపు విజయ్‌కుమార్‌ (జనసేన)
పాయకరావుపేట – కంబాల జోగులు, వంగలపూడి అనిత
నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌, అయ్యన్నపాత్రుడు
అరకు – గొడ్డేటి మాధవి, దున్ను దొర
పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గిడ్డి ఈశ్వరి