YES BANK ఆర్థిక సంక్షోభం : టీటీడీ ముందుచూపు

  • Publish Date - March 6, 2020 / 04:34 AM IST

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముందుపు చూపు ఎంతో మేలు చేసింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకపోయిన..బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను వెనక్కి ఉపసంహరించుకుంది. YES BANK నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే గుర్తించారు. ఈ బ్యాంకులో ఉన్న రూ. 600 కోట్ల డిపాజిట్లను కొన్ని నెలల క్రిందటే ఉపసంహరించుకున్నారు. టీడీపీ హయంలో ఎస్ బ్యాంకుతో సహా 4 ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బులను టీటీడీ డిపాజిట్లు చేసింది.

టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత…డిపాజిట్లపై వైవీ సుబ్బారెడ్డి దృష్టి సారించారు. నాలుగు బ్యాంకుల పరిస్థితి ఏ విధంగా ఉంది ? వాటి ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశారు. సమాచారం కూడా తెప్పించుకున్నారు. ఎస్ బ్యాంకు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వైవీ నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దేవుడి సొమ్ము భద్రంగా ఉండాలని సీఎం సూచించారు. దీంతో వెంటనే అందులో ఉన్న డిపాజిట్లను రిటర్న్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రూ. 600 కోట్ల టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించుకుంది. 

RBI  ఇప్పటికే  YES BANK కు  కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. 
డిపాజిట్ దారులు 50వేల రూపాయలకు మించి విత్‌ డ్రా చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. 
గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ మాజీ కీలక ఎగ్జిక్యూటివ్‌ తన వాటాలను విక్రయించారు. తర్వాత..డిపాజిట్ల ఉపసంహరణ భారీగా పెరిగిపోయిందని బ్లూమ్‌బర్గ్‌ ఓ కథనంలో పేర్కొంది. 
ఇదే సమయంలో స్టాక్‌ మార్కెట్‌లో బ్యాంకు షేర్‌ కూడా భారీగా పడిపోతూ వచ్చింది. 
బ్యాంకు మొండి బాకీల ఆందోళనకు తోడు మూలధన సమీకరణలో ప్రతికూలతలను ఎదుర్కొంటుందని ఇండియా నివేష్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు రవికాంత్‌ ఆనంద్‌ భట్‌ గతంలో విశ్లేషించారు. 
Read More : మహిళలు స్నానాలు చేస్తుంటే..రహస్యంగా చిత్రీకరించాడు..తర్వాత

See More :

యస్ బ్యాంక్ లో నగదు ఉపసంహరణ పరిమితి రూ.50 వేలు  

SBI ఖాతాలోకి YES BANK!

 

ట్రెండింగ్ వార్తలు