పోకిరీ లెక్చరర్…యువతులకు ప్రేమ వల, ఆపై బ్లాక్ మెయిల్

  • Publish Date - May 26, 2020 / 06:02 AM IST

చేసేది ప్రయివేటు కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం…. విద్యార్ధినులు, యువతుల ఫోన్ నెంబర్లు సేకరించటం….వారితో పరిచయం పెంచుకోవటం. వారి ద్వారా వారి స్నేహితుల నెంబర్లు తీసుకుని వారితో పరిచయాలు పెంచుకోవటం.. వారిని ప్రేమిస్తున్నానని  చెప్పటం…వారితో లైంగిక సంబంధం పెట్టుకోవటం, అవసరం తీరాక వారిని బ్లాక్ మెయిల్ చేయటం.  ఇదీ కీచక లెక్చరర్ చేసే పని. ధైర్యం చేసి ఒక మహిళ ఫిర్యాదు చేయటంతో ఇప్పుడా పోకీరీ లెక్చరర్  కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. 

నెల్లూరు జిల్లా వింజమూరు కు చెందిన ప్రశాంత్ ఎమ్మెస్సీ పూర్తిచేసి ఒక ప్రయివేటు కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు.  స్మార్ట్ ఫోన్ వాడటంలో ప్రావీణ్యం ఉన్న ప్రశాంత్ విద్యర్దినులు ద్వార్ తనకు తెలిసిన వారి ద్వారా యువతులు,విద్యార్ధినులు,  వివాహితల ఫోన్ నెంబర్లు సేకరించేవాడు. వారిని ఆకట్టుకునేలా మేసేజ్ లు పంపుతూ  ప్రేమలోకి దింపేవాడు. 

మీరు బాగున్నారు అందంగా ఉన్నారు అంటూ మాటలు కలిపి  పరిచయం పెంచుకుని వారి ఫోటోలు సేకరించేవాడు. వాటిని మార్ఫింగ్ చేసి వారికి పంపి బ్లాక్ మెయిల్ చేసేవాడు. అలా భయపడి అతడి వద్దకు వచ్చిన ఆడవారితో తన కామ కోరికలు తీర్చుకునేవాడు. 

ఒక వేళ  మహిళలు తాను చెప్పినట్లు వినకపోతే  మార్ఫింగ్ పోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించేవాడు.  అతడి వలలోపడి మోసపోయిన ఒక యువతి ధైర్యం చేసి నెల్లూరు దిశ మహిళా పోలీసు స్టేషవ్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంత్ ఫోన్ ను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

అతడి ఫోన్ లో మహిళతో చేసిన చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్,  అమ్మాయిల నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నాయి. ఇవి కాక అతడి వలలో పడి మోసపోయిన బాధితులు పదుల సంఖ్యలో ఉంటారని పోలీసులు  భావిస్తున్నారు. జిల్లాలోని కావలి, ఉదయగిరి, వింజమూరు, గూడురులతో పాటు తిరుపతిలోనూ అతని బారిన పడి అనేకమంది యువతులు  మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రశాంత్ ఉపయోగించిన ఫోన్ ను  పోలీసులు పరీక్షల  నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్ కు  పంపించారు. ఎంతో మంది అమాయక మహిళలను, యువతులను  మోసం చేసిన ప్రశాంత్ కు బెయిల్ లేకుండా  జైలుకు పంపినట్లు నెల్లూరు దిశ పోలీసు స్టేషన్  డీఎస్పీ నాగరాజు తెలిపారు. 

Read: మంథని పోలీస్ స్టేషన్ బాత్రూమ్‌లో నిందితుడు ఆత్మహత్య