Selfi Suicide (1)
Young man selfie suicide : తూర్పుగోదావరి జిల్లా మాగంకొప్పిశెట్టివారి పాలెంలో విషాదం ఘటన జరిగింది. అమ్మాయి మోసం చేసిందంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో భారీగా డబ్బులు, బంగారం తీసుకొని అమ్మాయి మోసం చేసిందని, ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటుందంటూ ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
‘వీడియోలో ఉన్న అమ్మాయి.. నన్ను చాలా విధంగా మోసం చేసింది. అందుకే నేను చచ్చిపోతున్నా..నన్ను అన్ని విధాలుగా వాడుకుంది. డబ్బు, బంగారం, బట్టలు, ప్రతి విషయంలో నన్ను వాడుకుంది.
ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్లిపోతుంది. అందుకే నేను చచ్చి పోతున్నాను.., బాయ్ ఫ్రెండ్స్’ అంటూ సదరు యువకుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అమ్మాయి మోసం చేయంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.