Young Woman Climbed The Water Tank
Visakhapatnam: ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి వాటర్ ట్యాంక్ ఎక్కింది. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా నర్శీపట్నంలో చోటుచేసుకుంది. నర్సీపట్నంలోని ఏరియా ఆసుపత్రి వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి తనకు ప్రియుడితో వివాహం జరిపించాలని, లేదంటే దూకుతానని బెదిరిస్తోంది.
రవి అనే యువకుడిని తాను ప్రేమిచానని, అతడు తనను మోసం చేశాడని ఆరోపిస్తుంది యువతి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని యువతిని కిందకు దింపే ప్రయత్నం చేస్తున్నారు.
రవితో పెళ్లి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయినా కూడా యువతి కిందకు దిగేందుకు నిరాకరించింది. తన ప్రియుడు రవిని ఇక్కడికి తీసుకొస్తేనే తాను కిందకు దిగుతానని చెబుతుంది. దీంతో పోలీసులు ట్యాంక్ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.