భక్తురాలిపై విరిగిపడిన చెట్టు కొమ్మ.. వీడియో వైర‌ల్‌

తిరుమల జపాలి తీర్థంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. తిరుమల నుంచి జపాలికి వెళ్తున్న భక్తురాలిపై చెట్టుకొమ్మ

భక్తురాలిపై విరిగిపడిన చెట్టు కొమ్మ.. వీడియో వైర‌ల్‌

Tree Broken In Tirumala

Updated On : July 12, 2024 / 3:16 PM IST

Tirumala : నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళా భ‌క్తురాలిపై చెట్టుకొమ్మ విరిగి పడింది. ఈ ఘటనతో మహిళ కిందపడిపోగా.. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తిరుపతి జాపాలి తీర్థంలో జరిగింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : బీచ్‌లో ఈతకొడుతూ 80కి.మీ సముద్రంలోకి కొట్టుకుపోయిన యువతి.. 37గంటల తరువాత ఏం జరిగిందంటే?

తిరుమల జాపాలి తీర్థంలో ఓ మహిళా భ‌క్తురాలు తీవ్రంగా గాయపడింది. తిరుమల నుంచి జాపాలికి వెళ్తున్న భక్తురాలిపై చెట్టుకొమ్మ విరిగిపడింది. దీంతో మహిళ వెన్నుముకకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు. అక్కడి వైద్యులు ఆమె వెన్నముకకు శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిసింది. గాయపడిన మహిళా భక్తురాలు కైకలూరుకు చెందిన ఉమారాణిగా గుర్తించారు.

Also Read : పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం.. రహస్య గదిలో 5 చెక్కపెట్టెల్లో విలువైన ఆభరణాలు

జాపాలి ఆలయం ఆంజనేయ స్వామి కొలువై ఉన్న ఆలయం. అక్కడికి చాలా మంది భక్తులు నిత్యం వెళ్తుంటారు. ఆలయానికి సమీపంలోనే చెట్టుకొమ్మ ఒక్కసారిగా విరిగి మహిళా భక్తురాలిపై పడటంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.