Love
Young Woman Protests : ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోమంటే నిరాకరించాడు..వెంటనే అతడితో వివాహం జరిపించాలి లేకపోతే..దూకి చచ్చిపోతా అంటూ ఓ యువతి బెదిరిస్తూ..హల్ చల్ చేసింది. వాటర్ ట్యాంక్ ఎక్కి బెదిరిస్తున్న యువతిని బుజ్జగించేందుకు కుటుంబసభ్యులు, స్థానికులు ప్రయత్నించారు. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి..సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏపీలోని పాలకొల్లు పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read More : Medha Srikanth: టాలీవుడ్‌లో మరో వారసురాలు.. గ్రాండ్ ఎంట్రీకి కసరత్తులు!
పాలకొల్లు బెత్లహంపేటలో పెట్టెల కేశవాణి నివాసం ఉంటున్నారు. ఈమె..తన మేనమామ కుమారుడైన యడ్ల భాస్కర్ లు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని రెండు రోజుల కిందట…కేశవాణి కోరింది. దీనికి భాస్కర్ నో చెప్పాడు. దీంతో ఆమె మనస్థాపానికి గురైంది. ప్రేమించిన తర్వాత పెళ్లి చేసుకోవడం లేదంటూ..పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ..సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో బెత్లహంపేటలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కింది ఆందోళనకు దిగింది కేశవాణి. భాస్కర్ తో వివాహం జరిపిస్తేనే..దిగొస్తానని ఖరాఖండిగా చెప్పింది.
Read More : Tokyo Paralympics: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం.. చరిత్రలో తొలిసారి
లేకపోతే దూకి ఆత్మహత్య చేసుకుంటానని కుటుంసభ్యులకు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసింది. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియడంతో పట్టణ ఎస్ఐ రెహ్మాన్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ ఏసుబాబు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని యువతితో ఫోన్ లో మాట్లాడారు. అక్కడకు భాస్కర్ ను తీసుకొచ్చి..మాట్లాడిపించారు. అనంతరం యువతితో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు. అనంతరం ఆమె కిందకు దిగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఇద్దరికీ కౌన్సెలింగ్ చేసి సమీప ఆలయంలో వివాహం జరిపించారు.