Medha Srikanth: టాలీవుడ్‌లో మరో వారసురాలు.. గ్రాండ్ ఎంట్రీకి కసరత్తులు!

మన తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు, దర్శక నిర్మాతల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు కానీ.. కూతుళ్ళను ఇండస్ట్రీలోకి తీసుకురావడం మాత్రం చాలా అరుదు.

Medha Srikanth: టాలీవుడ్‌లో మరో వారసురాలు.. గ్రాండ్ ఎంట్రీకి కసరత్తులు!

Medha Srikanth

Updated On : August 29, 2021 / 9:23 AM IST

Medha Srikanth: మన తెలుగు సినీ పరిశ్రమలో హీరోలు, దర్శక నిర్మాతల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు కానీ.. కూతుళ్ళను ఇండస్ట్రీలోకి తీసుకురావడం మాత్రం చాలా అరుదు. మంజుల ఘట్టమనేని, నిహారికా, మంచు లక్ష్మి లాంటి వాళ్ళు కొంతమంది వెండితెర మీదకి వచ్చినా కొడుకుల మాదిరి వెలిగిపోయిన దాఖలాలు మాత్రం లేవు. బాలీవుడ్ లో మాత్రం వారసురాళ్లు హవా కొనసాగుతుంది. ఉత్తరాది హీరోలకు పోటీగా స్టార్ డాటర్స్ అక్కడ రాజ్యమేలుతున్నారు. దక్షణాదిలో కూడా ఇప్పుడిప్పుడే ఈ విషయంలో మార్పు మొదలవుతుంది.

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఇప్పటికే హీరో రాజశేఖర్ కుమార్తెలు హీరోయిన్స్ గా పరిచయం కాగా.. ఇప్పుడు శ్రీకాంత్ కుమార్తె కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. శ్రీకాంత్-ఊహల పిల్లలలో కుమారుడు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇవ్వగా త్వరలోనే పెళ్లి సందD సినిమాతో రానున్నాడు. కాగా, ఇప్పుడు శ్రీకాంత్ కుమార్తె మేధా కూడా హీరోయిన్ గా రానుందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. మేధ ఇప్పటికే అనుష్క రుద్రమదేవిలో బాలనటిగా పరిచయమైంది. అచ్చం ఊహ రూపంతో ఉండే మేధ రుద్రమదేవితో ఆకట్టుకుంది.

అయితే, త్వరలోనే హీరోయిన్ గా పరిచయం చేసేందుకు గ్రాండ్ కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మేధా శిక్షణ పొందిన భరతనాట్య నృత్యకారిణి కాగా ప్రస్తుతం కాలేజ్ లో ఉన్న జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారిణిగా కూడా రాణిస్తుంది. త్వరలోనే వెండితెరపై అడుగుపెట్టేందుకు సరైన అవకాశం కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీకాంత్, ఊహ కూతురు ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా కథలను సెలక్ట్‌ చేసే పనిలో ఉండగా అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలో శ్రీకాంత్‌ వారసురాలిని ఎంట్రీ ఉండొచ్చని చెప్తున్నారు.