Starved to Death
Young Woman Suspicious Death: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో విషాదం నెలకొంది. 19ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్థరాత్రి తర్వాత కనిపించకుండా పోయిన యువతి రైలు పట్టాలపై శవమై కనిపించింది.
ఉలాసి తనూజ అలియాస్ గాయత్రి(19) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఇచ్ఛాపురం రైలునిలయం సమీపంలో బుధవారం(మార్చి 24,2021) ఉదయం రైలు ఢీకొని ఆమె చనిపోయింది. తనూజ మరణం మిస్టరీగా మారింది. పట్టణంలోని నీలాపువీధిలో తల్లిదండ్రులు, చెల్లెళ్లతో కలసి తనూజ ఉంటోంది. ఇంటర్ పూర్తి చేసిన తనూజ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. రోజూ మేడపై గదిలో కూతుళ్లు ముగ్గురూ నిద్రపోతుంటారు.
అలా మంగళవారం(మార్చి 23,2021) రాత్రి కూడా పడుకున్నారు. కాగా, అర్ధరాత్రి తర్వాత గాయత్రి కనిపించలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. గాయత్రి కోసం అంతా వెతుకులాట మొదలు పెట్టార. ఇంతలో వారికి ఓ షాకింగ్ న్యూస్ వినిపించింది. ఎల్‌సీ గేటు దగ్గర ఓ యువతి మృతదేహం ఉందనే విషయం తెలిసింది. అక్కడికి వెళ్లి చూడగా, అది గాయత్రి మృతదేహంగా గుర్తించిన తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కట్నమే కారణమా?
ఇటీవల గాయత్రికి ఓ పెళ్లి సంబంధం కుదిరిందని బంధువులు తెలిపారు. ఇరువైపులా ఇష్టపడటంతో పెళ్లి చేయాలని నిశ్చయించారు. అయితే కట్నం దగ్గర పేచీ వచ్చిందని, వారడిగినంత కట్నం ఇవ్వలేక వేరే సంబంధం చూడాలని గాయత్రి తల్లిదండ్రులు భావించారు. ఇదే ఆమెకు తీవ్ర మనస్తాపం కలిగించిందని బంధువులు చెబుతున్నారు. దీంతో ఆమె రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే ఆత్మహత్య? లేక హత్య? అనేది ఇంకా తేలలేదు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే క్లారిటీ వస్తుందని పోలీసులు అంటున్నారు.