Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డులో యువకుల ఓవర్ యాక్షన్.. షాకిచ్చిన పోలీసులు.. వీడియో వైరల్

తిరుమల ఘాట్ రోడ్డులో కొందరు యువకులు ఓవర్ యాక్షన్ చేశారు. తిరుపతి నుంచి తిరుమల క్షేత్రానికి వెళ్లే రెండో ఘాట్ లో కారులో ప్రయాణిస్తూ..

Rash Driving in Tirupati Ghat Road

Reckless Driving in Tirumala Ghat Road: తిరుమల క్షేత్ర ఆధ్యాత్మిక క్షేత్రం. నిత్యం గోవింద నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగుతుంది. భక్తులు క్రమశిక్షణతో కొండపైకి చేరుకొని కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అయితే, తాజాగా కొందరు యువకులు తిరుమల ఘాట్ రోడ్డులో హద్దులు మీరి ప్రవర్తించారు. భక్తులకు అసౌకర్యం కలుగుతుందన్న సోయిలేకుండా ఇష్టమొచ్చినట్లు సెల్ఫీలు దిగుతూ.. ర్యాష్ డ్రైవింగ్ తో రెచ్చిపోయారు. భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారికి షాకిచ్చారు.

Also Read: Gold Price: పసిడి ప్రియులకు భారీ ఊరట.. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఇలా..

తిరుమల ఘాట్ రోడ్డులో కొందరు యువకులు ఓవర్ యాక్షన్ చేశారు. తిరుపతి నుంచి తిరుమల క్షేత్రానికి వెళ్లే రెండో ఘాట్ లో కారులో ప్రయాణిస్తూ ఆకతాయి చేష్టలకు పాల్పడ్డారు. కారు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతోపాటు.. కారు వేగంగా వెళ్తున్న క్రమంలో కారు డోర్స్, రూప్ టాప్ తెరచి బయటకు తలలు పెట్టి సెల్పీలు తీస్తూ పెద్దగా కేకలు వేస్తూ రెచ్చిపోయారు. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అసలే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంటే.. ఘాట్ రోడ్డుపై వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో యువకులు కారును వేగంగా డ్రైవ్ చేయడంతోపాటు హద్దులుమీరి ప్రవర్తించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Kannappa : ‘క‌న్న‌ప్ప‌’లో మంచు విష్ణు కుమార్తెలు.. ‘నా మనవరాళ్లు..’ అంటూ మోహ‌న్ బాబు పోస్టు..

అదుపులోకి తీసుకున్న యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వారిని హెచ్చరించారు. కారు వేగంగా పోనిస్తూ, కారు డోర్లు తెరిచి యువకులు సెల్ఫీలు తీసుకుంటుండటంతో.. వారి వెనకాలే వచ్చిన వాహనంలోని భక్తులు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.